Risk of Covid-19 infection : వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.. జాగ్రత్త!

కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారా? ఇంకా కరోనా వచ్చే ఛాన్స్‌ లేదని బిందాస్‌గా ఫిల్‌ అవుతున్నారా? ఫ్రెండ్స్‌తో సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.

Risk of Covid-19 infection : వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు.. జాగ్రత్త!

Risk Of Covid 19 Infection After Vaccination

Risk of Covid-19 infection after vaccination : కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నారా? ఇంకా కరోనా వచ్చే ఛాన్స్‌ లేదని బిందాస్‌గా ఫిల్‌ అవుతున్నారా? ఫ్రెండ్స్‌తో సినిమాలకు, షికార్లకు వెళ్తున్నారా? అయితే ఒక నిమిషం ఆగండి. వ్యాక్సిన్ వేయించుకున్నా మీకు కరోనా రావచ్చు. మీ నుంచి ఆ వైరస్‌ మిగిలిన వారికి సోకచ్చు. అదేంటి వ్యాక్సిన్లు పనిచేయవా అనుకుంటున్నారా? వ్యాక్సిన్‌ తీసేసుకున్నాం.. ఇక మా ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తాం.. మాస్క్‌కు ఇక మంగళం పాడేస్తాం.. భౌతిక దూరం ఇక జాన్తా నై.. అంటే కుదరదంటున్నారు వైద్య నిపుణులు..

వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా కోవిడ్‌ 19 వైరస్‌ సోకే అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు. ద ఇంగ్లాండ్ జనరల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని ధృవీకరించారు.. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాక్సిన్‌లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.. అన్ని దేశాల్లో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.. దీంతో ఇక కరోనా కట్టడికి చెక్‌ పెట్టినట్టే అని సంబరాలు చేసుకోవద్దని సూచిస్తోంది.. పరిశోధకులు రాసిన లేఖ. అమెరికాలో కరోనా వారియర్స్‌కు వ్యాక్సినేషన్‌ తర్వాత కూడా ఈ వైరస్‌ సోకింది. డిసెంబర్‌ 16.. ఫిబ్రవరి 9 మధ్య వేలాది మందికి ఫైజర్‌ వ్యాక్సిన్‌ ఇచ్చారు..

ఇందులో మొదటి డోస్‌ తీసుకున్నవారు 36 వేల 659 మంది కాగా.. సెకండ్ డోస్‌ తీసుకున్న వారి సంఖ్య 28 వేల 184 మంది.. కానీ వీరిలో 379 కరోనా బారిన పడ్డారు.. మొదటి డోస్‌ తీసుకున్న వారం రోజుల తర్వాతనే ఈ మహమ్మారి బారిన పడ్డ వారు 71 శాతమని గణాంకాలు చెబుతున్నాయి.. రెండు డోసులు తీసుకున్న 37 మంది కూడా ఈ వైరస్ బారిన పడ్డారు.. దీన్ని బట్టి చూస్తే వ్యాక్సినేషన్ తీసుకున్నామని.. నిశ్చితంగా గడిపే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఈ విషయంలో మన కళ్ల ముందు కూడా అనేక ఉదహారణలు కనిపిస్తున్నాయి.. హర్యానా హోంమంత్రి అనిల్‌ విజ్‌కు వ్యాక్సిన్‌ తీసుకున్న 14 రోజుల తర్వాత కరోనా ఇన్ఫెక్షన్‌ కనిపించింది.

పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యాక్సిన్ తీసుకున్న వారం రోజుల్లోనే కరోనా సోకింది. ఇలాంటి కేసులు ప్రపంచ వ్యాప్తంగా వేలల్లో ఉన్నాయి. తెలంగాణలో కూడా ఇలాంటి కేసులు నమోదైనట్టు హెల్త్ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. వ్యాక్సిన్‌ తీసుకున్నాక.. ఇమ్యూనిటీ రావడానికి కొంత సమయం పడుతుంది. అప్పటి వరకూ జాగ్రత్తగా ఉండాల్సిందే. టీకా వేయించుకున్నాం కదా అని జాగ్రత్త చర్యలు పాటించకపోతే.. మరోసారి ఈ మహమ్మారి బారిన పడక తప్పదని సూచిస్తున్నారు వైద్య నిపుణులు.. వ్యాక్సిన్‌ తీసుకున్నాక కూడా మాస్క్‌లు ధరించడం.. భౌతిక దూరం పాటించడం తప్పనిసరి అని సూచిస్తున్నారు.