Soya Bean : శరీరానికి పోషకాలను సమకూర్చే సొయాచిక్కుడు

అకాల వృద్దాప్య లక్షణాలు రాకుండ నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైనది. కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి.

Soya Bean : శరీరానికి పోషకాలను సమకూర్చే సొయాచిక్కుడు

Soya Bean

Soya Bean : సోయా చిక్కుడు ఒక పప్పు ధాన్యం. ఇటీవలి కాలంలో భారత దేశంలో దీని వాడకం బాగా పెరిగింది. మాంసకృత్తుల కోసం వైద్యుల సైతం సోయా పదార్ధాలను సిఫార్సు చేస్తున్నారు. దీనిని ఆహారంగా తీసుకోవటం వల్ల శరీరానికి కావాల్సిన మాంసంకృత్తులు తేలికగా అందుతాయి. సోయా చిక్కుడు వలన అనేక ఆరోగ్యపరమైన లాభాలున్నాయని వివిధ పరిశోధనలో వెల్లడైంది.

సోయా చిక్కుడులో 40% మాంసకృత్తులు ఉంటాయి. పప్పు ధాన్యాలు, జంతు సంబధమైన ఆహరములోని మాంసకృత్తుల కన్నా సోయాచిక్కుడు మాంసకృత్తులు అధికం. 250 గ్రాముల సోయా చిక్కుళ్లలోని మాంసకృత్తులు దాదాపు 2 లీటర్లు పాలు, లేదా 1 కిలో మాంసము, లేదా 24 గ్రుడ్లలో వుండే మాంసకృత్తులకు సమానం.

ఓమెగా-3 మరియు 6 ఫాటీ యాసిడ్స్ సోయా నూనెలో కూడా సమృద్దిగా లభిస్తాయి. సోయా చిక్కుడులోని పీచు, అందునా కరిగే పీచు రక్తంలోని కొలెస్ట్రాల్, చక్కెరను నియంత్రిస్తుంది. ఇన్ సాల్యుబుల్ ఫైబర్ మల పరిమాణమును పెంచుటం వలన ప్రేవు క్యాన్సరు నివారించబడుతుంది.

సోయాలో కాల్షియం అధికంగా ఉంటుంది 1/2 కప్పు టోఫులో సుమారు 120 నుండి 750 మి.గ్రా. ల కాల్షియం మరియు 1 కప్పు సోయా పాలలో 93 మి.గ్రా. కాల్షియం ఉంటుంది. సోయా పాలను కాల్షియం తో ఫార్టిఫైట్ చేస్తే అందులో 200-300 మి.గ్రా. కాల్షియం మరియు విటమిన్ డి లు అధిక మోతాదులో లభిస్తాయి. సోయాలో అక్సలేట్లు మరియు ఫైటేట్లు ఉంటాయి.

ఆహరంలో సోయాచిక్కుడు కనీసం ఒకసారైన ఎంతో కొంత తీసుకోవటం వలన అనేక రకాల క్యాన్సర్ వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు అని పరిశోధనలు తెలుపుతున్నాయి.సోయాలో ఇరన్, కాల్షియం సమృద్దిగా ఉండటం వలన గర్బిణీ స్త్రీలకు, బాలింతలకు చాలా పుష్టికరము. పిల్లలకు కూడ సోయా పదార్దాలను రోజూ ఇవ్వటం వలన మానసిక, శారీరక పెరుగుదలకు తోద్పడుతుంది. దీనివలన పిల్లలలో బరువు. ఎత్తు, జ్ఞాపకశక్తి, రక్తంలో హిమోగ్లోబిన్ పరిమాణం పెరుగుతుంది.

అకాల వృద్దాప్య లక్షణాలు రాకుండ నివారించడంలో సోయా పాత్ర చాలా కీలకమైనది. కప్పు సోయా గింజల్లో 240 గ్రాముల మాంసం, 180 గ్రాముల చేపలు, 8 కప్పుల పాలు, 6 గుడ్లకు సమానమైన మాంసకృత్తులు అందుతాయి. సాధారణంగా మనం తీసుకొనే ప్రోటీన్లు అజీర్ణం కల్గిస్తాయి కాని వీటిలో అమైనో ఆమ్లాలు సాఫీగా అరిగిపోతాయి. పాలీ అన్ సాచురేటెడ్ ఫ్యాట్ లను కలిగి ఉండడం వలన సోయా వంటి ఆహర పదార్దాలు నేరుగా శరీరంలో ఉండే ఎల్ డి ఎల్ స్థాయిలను తగ్గిస్తాయి.  సోయా ఉత్పత్తులు ఫైటో ఈస్ట్రొజెన్ కలిగి ఉంటుంది, ఈ హర్మోన్ పురుషులలో టెస్ట్రొస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని నిరోధిస్తుంది.

రోమ్ము క్యాన్సర్ ను తగ్గిస్తుంది. సోయా ఉత్పత్తులు ఐసోప్లావనాయిడ్స్ లను కలిగి ఉంటాయి. ఇవి ఫైటో ఈస్ట్రోజెన్ లాగా వ్యవహరిస్తాయి. ఫైటో ఈస్ట్రొజెన్ అనే రసాయనకాలు ఈస్ట్రొజెన్ చర్యను తటస్థీకరణం చేసి, ట్యూమర్ ఏర్పడడాన్ని తగ్గిస్తుంది, డిఎన్ ఎ మార్పులలో జరిగే రెట్టింపును అరికడుతుంది. పసిపిల్లలకు తల్లిపాలు పడనప్పుడు సోయా పాలను కొంచెం ఇస్తే మంచిది. వీటిలో పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడే పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. సోయాలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది. సహజసిద్ద డిటర్జెంట్లుగా పేర్కోనబడే సాపోనిన్ లను సోయా ఉత్పత్తులు కలిగి ఉంటాయి. ఇవి పేగులలో కొవ్వు పదార్దాలతో బంధాన్ని ఏర్పర్చుకోని శరీరంలో గ్రహింపబడకుండా చేస్తాయి. అంతేకాకుండా ఈ సాపోనిన్ లు సూక్ష్మజీవులను చంపి, రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తాయి. బరువు తగ్గాలనుకునేవారు కూరల్లో వేసుకొని తీసుకుంటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.