No Face Mask : ఆ 6 దేశాల్లో ముఖానికి మాస్క్‌లు తప్పనిసరి కాదు.. ఎందుకంటే?

కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది.

No Face Mask : ఆ 6 దేశాల్లో ముఖానికి మాస్క్‌లు తప్పనిసరి కాదు.. ఎందుకంటే?

These 6 Countries Wearing Faces Mask Isnt Mandatory Anymore

Face Mask Isn’t Mandatory : కరోనా పుణ్యామని ప్రపంచమంతా సాధారణ జీవితానికి దూరమైపోయింది. మునుపటిలా స్వేచ్ఛగా తిరిగే పరిస్థితి లేకుండా పోయింది. బయట కాలుపెడితే చాలు.. మాస్క్ మస్ట్ అయిపోయింది. చాలావరకు ప్రపంచ దేశాల్లో మాస్క్‌లు ధరించడం ఇప్పుడు తప్పనిసరి అయింది. ఒకప్పుడు మాస్క్ అంటే దూరంగా పోయేవారంతా.. ఇప్పుడు మాస్క్ విడిచిపెట్టలేనంతగా పరిస్థితులు మారిపోయాయి.

ఏదేమైనా, కొన్ని దేశాల్లో మాత్రం మాస్క్ ధరించడం అనేది తప్పనిసరి కాదట.. కరోనా విజృంభిస్తున్న వేళ.. మాస్క్ తప్పనిసరి నిబంధనను ఎత్తివేశాయి. కరోనాను కంట్రోల్ చేయడంలో ఆ దేశాలు ఎలా విజయవంతమయ్యాయో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఇజ్రాయెల్ :
అది.. ఇజ్రాయెల్ దేశం.. ఏప్రిల్‌ నెలలోనే తప్పనిసరి ఫేస్ మాస్క్‌కు స్వస్తి పలికింది. మాస్క్ మస్ట్ నిబంధన ఎత్తేసిన మొట్టమొదటి దేశం కూడా ఇజ్రాయెల్. ఇజ్రాయెల్‌లో జనాభాలో 70 శాతానికి పైగా కొవిడ్ టీకాలు తీసుకున్నారు. ఏప్రిల్ 24 నుంచి దేశంలో కొత్త కరోనా కేసులు లేవు. కఠినమైన లాక్ డౌన్ విధించాక వైరస్ కంట్రోల్ లోకి వచ్చింది. ఇజ్రాయెల్ 8,39,000 కొవిడ్ కేసులు నమోదు కాగా.. 6,392 మరణాలు నమోదయ్యాయి.

2. అమెరికా :
మహమ్మారి వినాశనంలో అమెరికా తీవ్రంగా దెబ్బతింది. అయినప్పటికీ అగ్రరాజ్యం టీకాలు వేయడంలో విజయం సాధించింది. దాంతో పూర్తిగా టీకాలు తీసుకున్న వారిలో ఫేస్ మాస్క్ తప్పనిసరి నియమాన్ని ఎత్తేసింది. కొవిడ్‌ టీకాలో రెండు డోసులను అందుకున్నఅమెరికన్లు ఇకపై మాస్క్ ధరించడం తప్పనిసరి కాదని వెల్లడించింది. జన సమూహంలో ఫేస్ మాస్క్‌లను బహిరంగంగా ధరించాల్సిన అవసరం లేదు. కానీ, ప్రజా రవాణా సమయంలో విమానాలలో, రద్దీగా ప్రాంతాల్లో మాస్క్ ధరించాలి. అమెరికాలో ఇప్పటివరకు 34,043,066 కేసులు నమోదు కాగా.. 609,544 మరణాలు నమోదయ్యాయి.

3. న్యూజిలాండ్ :
న్యూజిలాండ్‌లో 2,658 కరోనా కేసులు, 26 కరోనా మరణాలు మాత్రమే నమోదయ్యాయి. కరోనాను కట్టడి చేయడంలో అక్కడి ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టడంతో పాటు సకాలంలో నిర్ణయాలు తీసుకుంది. ఫలితంగా కరోనా కంట్రోల్ అయింది. కొవిడ్‌ను అత్యంత సమర్థవంతంగా కంట్రోల్ చేసినందుకు ప్రధాని జకిందా ఆర్డెర్న్ ప్రపంచ నేతల ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు న్యూజిలాండ్‌లో మాస్క్ ధరించడం తప్పనిసరి కాదు. కొన్ని రోజుల క్రితం.. ఆక్లాండ్ సంగీత కచేరీని నిర్వహించగా.. సామాజిక దూరంతో పాటు మాస్క్ లేకుండా 50వేల మంది హాజరయ్యారు.

4. చైనా :
కరోనావైరస్ మొదటి కేసును 2019 డిసెంబర్‌లో చైనాలో నమోదైంది. అయినప్పటికీ, దాదాపు ప్రతి ఒక్కరూ టీకాలు వేయడంతో దేశం ఇప్పుడు మాస్క్ రహిత దేశంగా అవతరించింది. కరోనా మహమ్మారితో చైనా తీవ్రంగా దెబ్బతింది. కానీ, ప్రస్తుతం, చైనా సాధారణ స్థితికి చేరుకుంది. టూరిస్టుల కోసం పర్యాటక రంగాన్ని కూడా ఓపెన్ చేసింది.

5. భూటాన్ :
లామాస్ భూమి భూటాన్‌లో కరోనా మహమ్మారిని విజయవంతంగా కట్టడి చేసింది. వ్యాక్సినేషన్ ద్వారా కొవిడ్‌‌ను జయించింది. భూటాన్‌లో యువ జనాభాలో దాదాపు 90 శాతం మందికి కేవలం రెండు వారాల్లోనే టీకాలు పూర్తి చేశారు. దేశంలో ఇప్పటివరకు ఒక కరోనా మరణమే నమోదైంది. లాక్‌డౌన్ లోకి వెళ్లకుండా మాస్క్ రహితంగా మారిన మొదటి దేశాలలో భూటాన్ కూడా ఒకటిగా నిలిచింది.

6. హవాయి :
హవాయిలో కొవిడ్ కేసులు భారీగా తగ్గాయి. ఎక్కువ మందికి టీకాలు వేయడంతో కరోనా అదుపులోకి వచ్చింది. హవాయి ప్రజలు ఇకపై బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించాల్సిన అవసరం లేదు. టీకాలు సంబంధం లేకుండా మాస్క్‌లు ధరించకుండా స్వేచ్చగా బయట తిరగొచ్చు. ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం ఇంకా మాస్క్ ధరించాల్సిందే.. ఎక్కువ మందికి టీకాలు వేసే వరకు హవాయిలోని ఇండోర్ ప్రదేశాలలో మాస్క్‌లు ధరించాలని అక్కడి ప్రభుత్వాలు సూచించాయి.