Asleep : అన్నం తిన్నవెంటనే నిద్రపోవాలనిపిస్తోందా? ఎందుకలా!….

అన్నం మనేది చాలా సులభంగా జీర్ణమవుతుంది. తిన్న కొద్ది సేపటికే శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాతావరణంలో నివశించే వారు అన్నాన్ని ఎక్కవ ఇష్టంగా తింటారు. సాధారణంగా ఉదయం ట

Asleep : అన్నం తిన్నవెంటనే నిద్రపోవాలనిపిస్తోందా? ఎందుకలా!….

Sleep

Asleep : ఆకలితో కడుపు నిండా భోజనం చేస్తారు. అన్నం తిన్నాక కాస్తా అటు ఇటు తిరుగుతుంటారు చాలా మంది. అయితే కొంత మందికి మాత్రం అన్నం తిన్న వెంటనే కళ్ళపై నిద్ర తేలిపోతూ వచ్చేస్తుంటుంది. తిన్న వెంటనే బెడ్ పై అలా వాలిపోతుంటారు. ఇలాంటి వారిలో అన్నం తిన్నాక ఏదో మత్తు ఆవహించినట్లు, శరీరం మబ్బుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీంతో తిన్నాక లెగిచి నాలుగు అడుగులు వేసే ఓపిక కూడా లేనట్లుగా అలాగే నిద్రకు ఉపక్రమిస్తుంటారు. ఇలా ఎందుకు జరుగుతుందన్న సందేహం చాలా మందిలో వ్యక్తమౌతుంది.

అన్నం మనేది చాలా సులభంగా జీర్ణమవుతుంది. తిన్న కొద్ది సేపటికే శక్తిని అందిస్తుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత వాతావరణంలో నివశించే వారు అన్నాన్ని ఎక్కవ ఇష్టంగా తింటారు. సాధారణంగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రికి భోజనం చేయటం చాలా మందికి అలవాటు అయితే గ్రామీణ ప్రాంతంలోని వారు మూడు పూటలా అన్నాన్నే తింటుంటారు. అన్నంలో కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయి. కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఎవరు తీసుకున్నా వారికి నిద్ర రావటం, శరీరం మబ్బుగా అనిపిస్తుంది.

ఇలా ఎందుకు జరుగుతుందంటే అన్నం తిన్న తరువాత అందులో ఉండే కార్బొహైడ్రేట్లు మన శరీరంలో గ్లూకోజ్‌గా మారిపోతాయి. గ్లూకోజ్‌ మన శరీరానికి అందాలంటే ఇన్సులిన్ అవసరం అవుతుంది. ఇన్సులిన్‌ స్థాయిలు పెరగ్గానే మన శరీరంలో ట్రిప్టోఫాన్‌ అనే ఎసెన్షియల్‌ ఫ్యాటీ యాసిడ్‌ ప్రభావితం అయి మెలటోనిన్‌ను, సెరటోనిన్‌ను ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. ఈ రెండు హార్మోన్లు మానసిక ప్రశాంతతను అందించే గుణాన్ని కలిగి ఉంటాయి. అందుకే అన్నంతిన్న వెంటనే చాలా మందిలో సౌకర్యవంతంగా అనిపించి హాయిగా నిద్రలోకి జారుకుంటారు.

పిండి పదార్థాలు మాత్రమే కాకుండా ప్రోటీన్లు, కొవ్వులు ఉండే ఆహారాలను తిన్న సమయంలోనూ ఇలాంటి పరిస్ధితే ఎదురవుతుంది. మబ్బుగా ఉండటం, ఏపని చేయబుద్దికాకపోవటం, అలాగే పడుకోవాలని అనిపించటం ఇలాంటి వన్నీ సహజసిద్ధంగానే జరుగుతాయి.మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేకునే సమయంలో చాలా మంది నిద్ర స్ధితిలోకి జారుకుంటారు. మనం తీసుకునే ఆహారాన్ని కొద్ది మొత్తంలో ఎక్కువ సార్లు తీసుకునే ప్రయత్నం చేయాలి.

ఒకేసారి ఎక్కువ మొత్తంలో భోజనం చేయడం వలన పెద్ద మొత్తంలో కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయి. ఇవి రక్తంలో నేరుగా కలిసి నిద్రను ప్రేరేపించే హార్మోన్లు విడుదలకు కారణమవుతాయి. ఈ హార్మోన్లు ఎక్కువ మొత్తంలో విడుదల కాకుండా ఉండాలంటే తక్కువ మొత్తంలో భోజనం చేయాలి. పగలు తిన్నవెంటనే నిద్రపోవటం ఏమంత మంచిది కాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి సమయంలో తగినంత నిద్ర శరీరానికి అవసరం అవుతుంది.