Tight-Fitting Clothes : టైట్ జీన్స్, లెగ్గింగ్స్ ధరిస్తున్నారా? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

కొంతమంది ఆడ,మగ చాలా బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. వాటి వల్ల అందంగా, ఆత్మవిశ్వాసంతో కనపడతామని భావిస్తారు. టైట్‌గా ఉన్న దుస్తులు ధరించడం వారి వ్యక్తిగత విషయమైనప్పటికీ అలాంటి దుస్తులు రెగ్యులర్ గా ధరించడం వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు కలిగిస్తాయో కూడా తెలుసుకోవాలి.

Tight-Fitting Clothes : టైట్ జీన్స్, లెగ్గింగ్స్ ధరిస్తున్నారా? ఎలాంటి సమస్యలు వస్తాయో తెలుసా?

Tight-Fitting Clothes

Updated On : September 10, 2023 / 4:28 PM IST

Tight-Fitting Clothes : చాలామంది బిగుతుగా ఉండే దుస్తులు ధరించడానికి ఇష్టపడతారు. అవి తమని అందంగా కనిపించేలా చేస్తాయని ఫీల్ అవుతారు. అలా ధరించినపుడు ఏ పని చేయాలన్నా కాస్త ఇబ్బంది పడతారు. అవి ధరించడంలో తప్పు లేదు కానీ.. వాటిని ధరించడం వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయో మాత్రం ఖచ్చితంగా తెలుసుకోవాలి.

Sugar Damage Skin Health : చక్కెర అధికంగా తీసుకుంటే చర్మ ఆరోగ్యం దెబ్బతింటుందా ?

బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడిగా అనిపించడం.. చర్మం మీద ఎర్రటి మచ్చలు, ఇరిటేషన్, తిమ్మిరిగా అనిపించడం, సరిగా కదలలేకపోవడం, శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఎదురవడం, పొత్తి కడుపులో నొప్పి ఇలాంటి సమస్యలు ఎదుర్కొనవలసి ఉంటుంది.

టైట్ ప్యాంటు, లెగ్గింగ్స్, బెల్ట్‌లు, బిగుతూ ఉండే బ్రాలు వేసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసంతో కనిపించవచ్చు. కానీ వాటి వల్ల ఎదురయ్యే దుష్ప్రభావాల గురించి కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. బిగుతుగా ఉండే జీన్స్ పొట్ట, ప్రేగులపై అదనపు ఒత్తిడిని కలిగిస్తాయి. జీర్ణ సమస్యలకు దారి తీసే అవకాశం ఉంది. గుండెల్లో మంట, యాసిడ్ రిప్లక్స్ వంటి లక్షణాలను తీవ్రతరం చేస్తుంది. బిగుతుగా ఉండే దుస్తులు ధరించడం వల్ల శరీరంలోని కొన్ని ప్రాంతాల్లో రక్త ప్రసరణ తగ్గుతుంది. టైట్ స్కిన్నీ జీన్స్ ‘మెరల్జియా పరేస్తేటికా’ అనే నరాల వ్యాధికి దారి తీసే అవకాశం ఉందట. దీని వల్ల తొడ వెలుపలి భాగంలో తిమ్మిరి, నొప్పి కలుగుతుంది.

Hyderabad : అందం కోసం బ్యూటీపార్లర్‌కు వెళ్తున్నారా? మహిళలూ బీకేర్‌ఫుల్.. ఎంత ఘోరం జరిగిందో చూడండి

కాబట్టి అందానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చినా.. మన శరీర ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. అందుకోసం ఎల్లప్పుడూ సౌకర్యంగా ఉండే దుస్తులు ధరించడం అనేది చాలా ముఖ్యం.