వాట్సాప్‌లో బ్లూ‌టిక్ ఆఫ్ చేసినా, మెసేజ్ చూశారా లేదో ఇలా తెలుసుకోవచ్చు

  • Published By: sreehari ,Published On : February 25, 2020 / 11:24 AM IST
వాట్సాప్‌లో బ్లూ‌టిక్ ఆఫ్ చేసినా, మెసేజ్ చూశారా లేదో ఇలా తెలుసుకోవచ్చు

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్‌ 2014లో బ్లూ టిక్ ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ ద్వారా మీరు ఇతరులకు పంపిన వాట్సాప్‌ మెసేజ్ ను వారు చదివారో లేదో తెలుసుకునే అవకాశం ఉంది. మెసేజ్ పంపినప్పుడు మీకు సింగిల్ టిక్ మార్క్ కనిపిస్తే అది విజయవంతంగా పంపినట్టు అర్థం.

అదే డబుల్ గ్రే టిక్స్ మార్క్ కనిపిస్తే.. మెసేజ్ విజయవంతంగా డెలివరీ అయింది. కానీ, మెసేజ్ ఓపెన్ చేసి చూడలేదని అర్థం. ఒకవేళ రెండు బ్లూ టిక్ మార్క్స్ కనిపిస్తే మాత్రం.. పంపిన మెసేజ్ ఓపెన్ చేయడం చదవడం కూడా జరిగినట్టు తెలుసుకోవచ్చు. కానీ, చాలామంది యూజర్లు తమ మెసేజ్ చదివినట్టు ఇతరులు తెలియడం ఇష్టపడటం లేదు. ప్రైవసీగా ఉండాలని భావిస్తున్నారు.

అందుకే వాట్సాప్ అకౌంట్లో రీడ్ రిసిప్ట్ ఎనేబుల్ ఉండేలా చూస్తారు. వాట్సాప్ సెట్టింగ్స్ లో ఉండే ఈ ఫీచర్ ఒకవేళ డిజేబుల్ చేస్తే మాత్రం పంపించిన మెసేజ్ ఇతరులు చూశారో లేదో తెలుసుకోలేరు. అయినప్పటికీ మీ మెసేజ్ ఇతరులు చదివినట్టు తెలుసుకోనే టెక్నిక్ ఒకటి ఉంది. వాట్సాప్ మెసేజ్ పంపినప్పుడు వారి యాప్ సెట్టింగ్స్‌లో బ్లూ టిక్ మార్క్ డిసేబుల్ చేసి ఉందని ఎలా తెలుసుకోవాలో ఈజీగా గుర్తించవచ్చు. అంతేకాదు.. వారు మీ మెసేజ్ చదివినా కూడా రిప్లయ్ ఇవ్వలేదని అర్థం..

* వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి.
* ఎవరైతే రీడ్ రిసిప్ట్ డిజేబుల్ చేశారో వారికి ఏదైనా మెసేజ్ పంపండి.
* అది కూడా వాయిస్ మెసేజ్ మాత్రం.. అంటే వాయిస్ నోట్ పంపించాలి.
* ఆ వ్యక్తి వాయిస్ నోట్ వినగానే మైక్రోఫోన్ ఐకాన్ బ్లూ కలర్లోకి మారిపోతోంది.
* మీరు మెసేజ్ పంపి వ్యక్తి మెసేజ్ చదవుతున్నారని, కానీ, రిప్లయ్ ఇవ్వడం లేదని అర్థం

వాట్సాప్ యూజర్లలో ఎవరైనా మీరు పంపిన మెసేజ్ చూశారో లేదో తెలుసుకునేందుకు ఇది కొత్త మెథడ్ టెక్నిక్ కాదు. 2018లో మార్చి తొలిసారి దీన్ని గుర్తించారు. ఇంకా ఫిక్స్ చేయాల్సి ఉంది. మరోవైపు వాట్సాప్ వివాదాల్లో చిక్కుకుంటోంది. జెఫ్ బెజాస్ ఫోన్ హ్యాక్ అయినప్పటి నుంచి వేలాది మంది వాట్సాప్ గ్రూపుల్లో తమ చాట్ లింక్స్ యూజర్లకు తెలియకుండానే గూగుల్ సెర్చ్ లో ఇండెక్స్ అవుతున్నాయి.