11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ

పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్.. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది.

11th hour Review : లెవన్త్ అవర్.. రివ్యూ

11th Hour Web Series Review

11th hour Web Series Review : తెలుగులో వచ్చే వెబ్ సిరీస్‌ల్లో మనవాళ్లు కంటెంట్, మేకింగ్ క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా రాజీపడటం లేదు. దానికి లెవన్త్ అవర్ వెబ్ సిరీస్ లేటెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఉపేంద్ర నంబూరి రాసిన 8 అవర్స్ అనే నవల్ ఆధారంగా ఉప్పలపాటి ప్రదీప్ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించారు. అవార్డు విజేత డైరెక్టర్ ప్రవీన్ సత్తారు రూపొందించిన ఈ లెవన్త్ అవర్ వెబ్ సిరీస్.. తెలుగువారికి అన్‌లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తూ, డిజిటల్ రంగంలో దూసుకుపోతున్న తెలుగు ఓటీటీ ఆహాలో ఏప్రిల్ 9 (శుక్రవారం) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

పురుషాధిక్య ప్ర‌పంచంలో త‌న‌దైన గుర్తింపు సంపాదించుకోవ‌డానికి అర‌త్రికా రెడ్డి అనే ఓ అమ్మాయి ఎలా పోరాటం చేసింద‌నేది ఈ సిరీస్ మెయిన్ థీమ్.. డ్రామా, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మేళ‌వింపుగా ఈ ‘లెవన్త్ అవర్’ 8 ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌గా రూపొందింది. మ‌ల్టీ బిలియ‌న్ డాల‌ర్స్ కంపెనీ ఆదిత్య గ్రూప్ కంపెనీకి అర‌త్రికా రెడ్డి సీఈఓ. ఈ పాత్రలో తమన్నా భాటియా ఒదిగిపోయింది. దాదాపు 8ఏళ్ల క్రితం తండ్రి నుంచి అధికార పగ్గాలు ఆమె అందుకుంటుంది. అడ్వాన్స్ హైబ్రిడ్ న్యూక్లియర్ రియాక్టర్ (AHNR) టెక్నాలజీ ద్వారా దేశంలోని మారుమూల గ్రామాలకు కూడా క్వాలిటీ పవర్ ను తక్కువ ధరకే అందించాలన్నది అరత్రికా రెడ్డి ఆశయం..రాజకీయ, బ్యూరో క్రైసిస్ వ్యవస్థలోని కొందరి వ్యక్తుల కారణంగా ఆమె ముందుడగు వెళ్లలేకపోతుంది. అరత్రికా రెడ్డి కంపెనీ అనుకోకుండా ఆర్థిక స‌మ‌స్యల వ‌ల‌యంలో చిక్కుకుంటుంది.

ఎనిమిదేళ్లలో కంపెనీ లాభాలు తగ్గిపోయి అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. ఆమె స్నేహితులే శ‌త్రువులుగా మారుతారు. ఆర్థిక చిక్కుల్లో కూరుకుపోయిన తన కంపెనీని అరత్రికాకు ఇంపియరియల్ బ్యాంకు చైర్మన్ పదివేల కోట్ల అప్పున వెంటనే చెల్లించాలంటూ ఆదేశించారు. లేదంటే కంపెనీని జప్తు చేస్తానని వార్నింగ్ ఇస్తాడు. ఒక రాత్రిలో అరత్రికా రెడ్డి అంత పెద్ద మొత్తంలో సొమ్మును బ్యాంకుకు చెల్లించిందా? లేదా అలాగే తన చుట్టు కాచుకున్న రాబందుల్లాంటి ప్రత్యర్థి కంపెనీల పన్నాగాలను ఆమె ఎలా ఎదుర్కొందన్నదే లెవన్త్ అవర్ స్టోరీ.. ఎగ్జ‌యిట్‌మెంట్‌తో కూడిన ఈ గంద‌ర‌గోళం నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అర‌త్రికా రెడ్డి ఎలా పోరాడింది. ఆ జీవ‌న పోరాటంలో ఆమె విజ‌యం సాధించిందా? అనే ఆస‌క్తిక‌ర‌మైన అంశాల‌తో ‘లెవన్త్ అవర్’ సిరీస్ తెరకెక్కింది.

మొత్తం 8 ఎపిసోడ్ లతో సాగే ఈ వెబ్ సిరీస్ ప్రారంభమే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కన్న తండ్రి, తమ్ముడు, మాజీ భర్త, తోటి భాగస్వాములు నమ్మిన స్నేహితులే శత్రువులుగా మారి పీడిస్తారు. అయినప్పటికీ అందరిని ఓ బిజినెస్ ఉమెన్ ఎదుర్కొన్న స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. ఒక కార్పొరేట్ సీఈఓగా అద్భుతంగా నటించింది. ఒక రాత్రిలో జరిగే స్టోరీ ఇది.. ప్రతి ఎపిసోడ్ ప్రారంభంలో కొన్ని నిమిషాల పాటు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అరత్రికా రెడ్డి చిన్నప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన కీలక సంఘటనలను అందంగా చూపించారు.

కార్పొరేట్ టైకూన్ కాకుండా తండ్రి నిరాధరణకు గురైన కూతురిగా.. భర్తచేత వంచించిన భార్యగా… కొడుకు కోసం ప్రాణం పెట్టే తల్లిగా డిఫరెంట్ షేడ్స్ ఉన్నట్టుంటి పాత్రలో తమన్నా అద్భుతంగా నటించారు. తమన్నా తండ్రిగా మధుసూదన్ రావు, తల్లిగా పవిత్రా లోకేష్, మాజీ భర్తగా వంశీ కృష్ణ నటించారు. స్నేహితుడు పీటర్ గా అరుణ్ అదిత్, ప్రత్యర్థి కంపెనీ అధినేత రాజీవ్ వర్థన్ ఠాగూర్ గా శత్రు నటించారు. ఈ వెబ్ సిరీస్ లో శత్రు న్యూ లుక్, డిఫరెంట్ గా కనిపించాడు. ప్రియా బెనర్జీ కిల్లర్ నోరా రోల్ చేశారు.

కీలక పాత్రల్లో జయ్ ప్రకాశ్, అభిజిత్, శ్రీకాంత్ అయ్యంగార్, రోషిణి ప్రకాశ్ నటించారు. చందమామ కథల పేరుతో గతంలోనే ప్రవీణ్ సత్తారు సిల్వర్ స్క్రిన్ పై ఈ ప్రయోగాన్ని చేశాడు. వెబ్ సిరీస్ టేకింగ్ లోనూ కనిపిస్తుంది. ప్రదీప్, డైరెక్టర్ ప్రవీణ్, బీం శ్రీనివాస్ రాసిన మాటలు పాత్రలకు తగినట్టుగా సరిపోయాయి. ముఖేశ్ విజువల్స్, భరత్, సౌరభ్ నేపథ్య సంగీతం బాగుంది. లెవన్త్ అవర్ మొదటి ఎపిసోడ్ చూస్తే.. ఆ తర్వాతి ఎపిసోడ్లలో ఏమౌతుందోనన్న ఆసక్తి వ్యూయర్లలో రాకమానదు. తెలుగు వెబ్ సిరీస్ ల్లో బెస్ట్ మేకింగ్ వాల్యూస్ ఉన్న లెవన్త్ అవర్ వెబ్ సిరీస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు..