అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో ఆ ముగ్గురు.. వీరి సంపాదన ఎంతంటే?

  • Published By: sreehari ,Published On : November 11, 2020 / 05:30 PM IST
అత్యంత శక్తివంతమైన భారతీయ మహిళల్లో ఆ ముగ్గురు.. వీరి సంపాదన ఎంతంటే?

3 most powerful Indian women : భారతదేశంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో పలు రంగాల నుంచి ముగ్గురు మహిళలు టాప్ ప్లేస్ లో నిలిచారు. ఎంటర్ టైన్మెంట్ రంగంతో పాటు ఇతర బిజినెస్ వ్యాపార రంగాల్లోనూ అత్యంత సంపన్న మహిళలుగా నిలిచారు.

ఇటీవలే ప్రముఖ Fortune India మ్యాగజైన్.. దేశంలోని వివిధ రంగాలకు చెందిన 50మందికి పైగా మహిళలను అవార్డులతో సత్కరించింది.



ఫర్ఛూన్ ఇండియా అత్యంత శక్తివంతమైన మహిళలను బిజినెస్ 2020 జాబితాలో ముగ్గురు మహిళల పేర్లను వెల్లడించింది. వారిలో భారతీయ ఎంటర్ టైన్మెంట్ రంగానికి చెందినవారే ముగ్గురు ఉన్నారు.

వారు ఎవరంటే? బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జోనాస్, అనుష్క శర్మ, ఇక్తా కపూర్ ముగ్గురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వీరిలో ఎవరెవరు ఎంత సంపాదిస్తున్నారో తెలుసుకుందాం..



1. Priyanka Chopra Jonas
Forbes 2018 శక్తివంతమైన మహిళల జాబితాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా జోనస్ చోటు దక్కింది. 2020 ఏడాదిలోనూ ఫార్చూన్ భారతీయ అత్యంత శక్తివంతమైన మహిళల్లో ప్రియాంకా చోప్రా 37వ ర్యాంకులో చోటు దక్కింది.
 Priyanka Chopra Jonasప్రపంచంలోని చోప్రా జోనస్ అత్యంత శక్తివంతమైన సెలబ్రిటీల్లో ఒకరిగా నిలిచింది. ఒక నటిగా మాత్రమే కాదు.. 38ఏళ్ల గ్లోబల్ ఐకాన్ గా విజయవంతమైన పారిశామ్రికవేత్తగా నిలిచింది. 2015లో Purple Pebble Pictures అనే కంపెనీని ప్రియాంక స్థాపించింది.



గత ఏడాదిలో ఫోర్భ్స్ ఇండియా 2019 సెలబ్రిటీల 100 జాబితాలో తన వార్షిక సంపాదన 23.4 కోట్లతో ప్రియాంక చోటు దక్కించుకుంది. ఈ ఏడాదిలో నికర ఆదాయం 50 మిలియన్ డాలర్లుగా అంచనా.. వార్షిక ఆదాయం దాదాపు రూ. 73 కోట్లు ఉంటుందని అంచనా. సింగర్ నిక్ జోనస్ ను పెళ్లాడిన తర్వాత ప్రియాంక ప్రస్తుతం లాస్ ఏంజెలెస్ లో ఉంటోంది. 144 కోట్ల విలువైన విలాసవంతమైన నివాసంలో ఉంటున్నారు.

2. Anushka Sharma
2008లో అనుష్క శర్మ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. Rab Ne Bana Di Jodi హిందీ మూవీ షారుక్ ఖాన్ తో జోడీగా నటించింది. ఆ తర్వాత నుంచి అనేక మూవీల్లో నటిస్తూ టాప్ నటిగా రాణిస్తూనే వ్యాపారవేత్తగా ఎదిగారు.
 Anushka Sharma

భారతదేశంలో అత్యధిక సంపాదన కలిగిన సెలబ్రిటీల్లో ఒకరిగా అనుష్క శర్మ నిలిచింది. బాలీవుడ్ నటిగానే కాదు.. వ్యాపార రంగంలో కూడా తిరుగులేదని నిరూపించుకుంది.



2013లో అనుష్క ప్రొడక్షన్ కంపెనీని స్థాపించారు. 2020 ఫిబ్రవరిలో తన భర్త విరాట్ కోహ్లీతో కలిసి 2.2 కోట్ల పెట్టుబడితో ‘డిజిట్’ అనే ఇన్సూరెన్స్ స్టార్టప్ కంపెనీని స్థాపించారు.

ఆడి క్యూ8 వంటి లాండ్ రోవర్ రేంజ్ వంటి లగ్జరీ కార్లు కూడా ఉన్నాయి. ముంబైలో 34 కోట్ల లగ్జరీ హౌస్ కూడా ఉంది.

గుర్గావ్ లో 80 కోట్ల అపార్ట్ మెంట్ ఉంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ తమ మొదటి బిడ్డకు 2021లో వెలకమ్ చెప్పబోతున్నారు.

3. Ekta Kapoor :
భారత టెలివిజన్ యాక్టర్ ఎక్తా కపూర్.. సింగిల్ హ్యాండ్ తో టెలివిజన్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.. బాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగానూ, డైరెక్టర్ గానూ రాణిస్తున్నారు.

పద్మ శ్రీ అవార్డు గ్రహిత అయిన 45ఏళ్ల కపూర్.. బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ డైరెక్టర్ కూడా ఉన్నారు.



2012లో తన 36వ ఏటా ఫోర్భ్స్ ఏసియాలో శక్తివంతమైన వ్యాపార మహిళల జాబితాలో చోటు దక్కించుకున్నారు.Ekta Kapoor

ఈ ఏడాది 2020లోనూ ఫార్చూన్ ఇండియాలో 2020 వ్యాపార రంగంలో అత్యంత శక్తివంతమైన మహిళల్లో ఒకరిగా చోటు దక్కింది.



2017లో ALT బాలాజీ డిజిటల్ ప్లాట్ ఫాంను స్థాపించారు. ఫార్చూన్ ఇండియా ప్రకారం.. మార్చి 2020లో ఎక్తా కపూర్ నాయకత్వంలో ప్రైమ్ టైమ్ వ్యూయిర్ షిప్ 18శాతం షేర్ దక్కించుకుంది.

దాంతో మొత్తంగా OTT ప్లాట్ ఫాంపై ఆదాయం 77 కోట్లకు చేరింది. వార్షిక వేతనంగా తన నికర ఆదయాం జూలై 2020 నాటికి 2.5 కోట్లు వరకు ఉంటుందని అంచనా.

బాలాజీ టెలిఫిల్మ్స్ లో ఉద్యోగులను తన ఏడాది వేతనం 2.5 కోట్లతో ఆర్థిక సాయంతో ఆదుకుంటోంది.