67th Film Fare South Awards : 67వ సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డు విన్నర్స్ వీళ్ళే..

 తాజాగా 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు...........

67th Film Fare South Awards : 67వ సౌత్‌ ఫిలింఫేర్‌ అవార్డు విన్నర్స్ వీళ్ళే..

67th Film Fare South Awards telugu winners list

67th Film Fare South Awards :  తాజాగా 67వ సౌత్‌ ఫిల్మ్ ఫేర్‌ అవార్డు వేడుకలు ఆదివారం సాయంత్రం బెంగళూరు ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్‌ వేదికగా ఘనంగా జరిగాయి. ఈ వేడుకకి సౌత్ సినీ ప్రముఖులు విచ్చేసి మెరిపించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ సినీ పరిశ్రమలలో 2020, 2021 మధ్య వచ్చిన సినిమాలకి ఈ అవార్డులని ప్రదానం చేశారు.

తెలుగులో ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నది వీళ్ళే..

ఉత్తమ నటుడు : అల్లు అర్జున్ (పుష్ప)

ఉత్తమ నటి : సాయి పల్లవి (లవ్ స్టోరీ)

ఉత్తమ చిత్రం : పుష్ప ది రైజ్

ఉత్తమ దర్శకుడు : సుకుమార్ (పుష్ప)

ఉత్తమ సహాయ నటుడు : మురళీ శర్మ (అల వైకుంఠపురములో)

ఉత్తమ సహాయ నటి : టబు (అల వైకుంఠపురములో)

బెస్ట్ లిరిక్స్ : సీతారామ శాస్ట్రీ – లైఫ్ ఆఫ్ రామ్ (జాను)

బెస్ట్ ప్లేబాక్ సింగర్ (మేల్) : సిద్ శ్రీరామ్ – శ్రీవల్లి (పుష్ప)

బెస్ట్ ప్లేబాక్ సింగర్ (ఫిమేల్) : ఇంద్రవతి చౌహన్ – ఊ అంటావా (పుష్ప)

బెస్ట్ కోరియోగ్రఫీ : శేఖర్ మాస్టర్ – రాములో రాములా (అల వైకుంఠపురములో)

బెస్ట్ సినిమాటోగ్రఫీ : మీరోస్లా కూబా బ్రజక్ (పుష్ప)

బెస్ట్ డెబ్యూ హీరో : పంజా వైష్ణవ్ తేజ్ (ఉప్పెన)

బెస్ట్ డెబ్యూ హీరోయిన్ : కృతి శెట్టి (ఉప్పెన)

బెస్ట్ యాక్టర్ క్రిటిక్స్ – నాని (శ్యామ్ సింగరాయ్)

బెస్ట్ యాక్ట్రెస్ క్రిటిక్స్ – సాయి పల్లవి (శ్యామ్ సింగరాయ్)

లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు: అల్లు అరవింద్

ఈ అవార్డుల్లో మరోసారి పుష్ప సినిమా సత్తా చాటింది. అవార్డు విన్నర్స్ కి అభిమానులు, ప్రముఖులు అభినందనలు తెలుపుతున్నారు.