Deepika Padukone: దీపికాకు అరుదైన ఘనత.. ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు!

బాలీవుడ్‌లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో గత కొద్దికాలం..

Deepika Padukone: దీపికాకు అరుదైన ఘనత.. ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు!

Deepika Padukone

Deepika Padukone: బాలీవుడ్‌లో అందంతోపాటు అభినయం ఉన్న నటి దీపికా పదుకొనే. రణ్‌వీర్‌ సింగ్‌తో పెళ్లి తర్వాత కూడా క్రేజీ ఆఫర్లు అందుకుంటూ కెరీర్‌లో దూసుకుపోతోంది. బాలీవుడ్‌లో గత కొద్దికాలంగా హీరోయిన్ ఓరియెంటెట్ పాత్రలు ధరించడమే కాకుండా నిర్మాతగా కూడా ప్రయోగాలు చేస్తున్న దీపికా.. తాను నటించే సినిమాల్లో నటనకు ఆస్కారం ఉన్న పాత్రలను ఎంచుకొంటూ ముందుకెళ్తుంది. బాలీవుడ్‌లో హీరోలకు సమానంగా ఉండే పాత్రల్లో నటించి మెప్పిస్తున్న ఈ కన్నడ సోయగానికి అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు కురుస్తున్నాయి.

Kaathu Vaakula Rendu Kadhal: సామ్, నయన్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. ఓటీటీలోనే?

దీపికాకు తాజాగా అరుదైన ఘనత దక్కింది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి ఇచ్చే ‘ది గ్లోబల్ అచీవర్స్ అవార్డు 2021’ని దీపికా దక్కించుకుంది. ఈ అవార్డు కోసం ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యం, చదువు, టూరిజం వంటి వివిధ రంగాల్లో ఈ ఏడాది 3000 వేలపైగా నామినేషన్లు రాగా నటనకు సంబంధించి ఉత్తమ నటిగా దీపికా అవార్డు సాధించింది. ఈ అవార్డుకు అమెరికా మాజీ ప్రెసిడెంట్‌ బరాక్‌ ఒబామా, బిజినెస్‌మెన్‌ జెఫ్‌ బెజోస్‌, క్రీడాకారుడు క్రీస్టీనో రోనా​ల్డో లాంటి హేమహేమీలతో కలిసి ఎంపికయ్యింది.

Alia Bhatt: టార్గెట్ 2022.. సీనియర్ హీరోయిన్స్‌ను మించిపోతున్న అలియా

కాగా ఇండియా నుంచి ఈ అవార్డుకు ఎంపికైన తొలి ఇండియన్‌ కూడా దీపికే కావడం విశేషం కాగా గతంలో కూడా ఇలాంటి అరుదైన ఘనతలను దీపికా సొంతం చేసుకుంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా టైమ్ మ్యాగజైన్ రూపొందించిన 100 మంది ప్రతిభావంతుల జాబితాలో దీపిక చోటు సంపాదించగా.. దావోస్ 2020 సదస్సులో 26వ వార్షిక క్రిస్టల్ అవార్డును అందుకొన్న తొలి భారతీయ నటిగా అప్పట్లో ఘనతను దక్కించుకుంది. కాగా, ప్రస్తుతం దీపికా హృతిక్‌ రోషన్‌తో కలిసి ‘ఫైటర్‌’, అమితాబ్‌తో కలిసి ‘ది ఇంటర్న్‌’, తన భర్త రణ్‌వీర్‌ సింగ్‌తో కలిసి ‘83’తో పాటు మరి కొన్నిహాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.