Aadi Sai Kumar: “తీస్ మార్ ఖాన్” ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!!

సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న హీరో ఆది సాయికుమార్

Aadi Sai Kumar: “తీస్ మార్ ఖాన్” ఫస్ట్ లుక్.. మాములుగా లేదుగా!!

Teesmar Khan

Aadi Sai Kumar: సరైన హిట్ కోసం చాలాకాలంగా ఎదురుచూస్తున్న హీరో ఆది సాయికుమార్. సాయికుమార్ కొడుకుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ప్రేమకావాలి సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోవడం కోసం కష్టపడుతూనే ఉన్నారు ఆది. ఆ క్రమంలోనే ఓ మాస్ ఇమేజ్‌తో ‘తీస్ మార్ ఖాన్’ అనే సినిమాతో వచ్చేందుకు సిద్ధమయ్యాడు.

నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జీ గోగణ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రొడక్షన్ నెంబర్-3 గా విజన్ సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ వ్యాపారవేత్త నాగం తిరుపతి రెడ్డి  ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా నటిస్తుండగా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో సునీల్ నటిస్తున్నాడు.

దసరా పండగ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రయూనిట్. ఆది ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తుండగా హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతుంది. ఫస్ట్ లుక్‌లో సిగరెట్ కాలుస్తూ.. నడుస్తున్నట్లు ఉన్న మాస్‌లుక్ అదిరిపోయింది. ఈ సినిమాలో స్టూడెంట్‌గా, రౌడీగా, పోలీస్‌గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది నటిస్తుండటం విశేషం. సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ, మణికాంత్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.