Adipurush VFX : ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్‌పై విపరీతంగా ట్రోలింగ్.. చేసింది మేము కాదని NY VFXWaala క్లారిటీ

ఆదిపురుష్ కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది.

Adipurush VFX : ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్‌పై విపరీతంగా ట్రోలింగ్.. చేసింది మేము కాదని NY VFXWaala క్లారిటీ

Adipurush VFX : రెబల్ స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో నటించిన అప్‌కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘ఆదిపురుష్’. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్‌ను ఆదివారం విడుదల చేయగా.. టీజర్ చూసిన ప్రేక్షకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దర్శకుడు ఓం రౌత్ బొమ్మలతో గారడీ చేశారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. టీజర్‌లో కంప్యూటర్ గ్రాఫిక్స్, యానిమేషన్ చాలా చీప్ గా ఉన్నాయని ఫైర్ అవుతున్నారు. ఈ వీఎఫ్ఎక్స్ కన్నా.. చోటా భీమ్ లాంటి కార్టూన్స్‌లో యానిమేషన్ చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

టీజర్‌లో కొన్ని సన్నివేశాలను మోషన్ క్యాప్చర్ యానిమేషన్‌లో చేయడంతో ఆ పాత్రలు సహజత్వాన్ని కోల్పోయాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ సైతం బొమ్మల మాదిరిగా మారిపోవడంతో.. ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు వానరాలకు బదులు హాలీవుడ్ యాక్షన్ సినిమాల్లో మాదిరిగా గొరిల్లాలను చూపించడం విమర్శలకు తావిచ్చింది. ఆ సన్నివేశాలన్నీ హాలీవుడ్ సినిమాల నుంచి కాపీ కొట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఇక ఈ కంప్యూటర్ గ్రాఫిక్స్‌ను ముంబైకి చెందిన NY VFXWaala అనే వీఎఫ్ఎక్స్ స్టూడియో చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఆ సంస్థ స్పందించింది. మీడియాకు ఒక ప్రకటనను విడుదల చేసింది. ‘ఆదిపురుష్’ కంప్యూటర్ గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్ తాము చేయలేదని NY VFXWaala స్పష్టం చేసింది. కొంతమంది మీడియా ప్రతినిధులు తమను ప్రశ్నించడంతో ఈ ప్రకటన విడుదల చేయాల్సి వచ్చిందని వివరణ ఇచ్చింది.

NY VFXWaala వీఎఫ్ఎక్స్ స్టూడియోను బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ స్థాపించారు. ఇండియన్ వీఎఫ్ఎక్స్ నిపుణులు నవీన్ పాల్, ప్రసాద్ సుతార్‌తో కలిసి అజయ్ దేవగణ్ ఈ సంస్థను నెలకొల్పారు. ప్రస్తుతం చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. అజయ్ దేవగణ్ నటించిన ‘శివాయ్’, ‘తానాజీ’ సినిమాలకు ఈ స్టూడియో పనిచేసింది. ‘తానాజీ’ సినిమాకు ఓం రౌత్ దర్శకుడు. అందుకే, అజయ్ దేవగణ్ కంపెనీ NY VFXWaala‌తో ఓం రౌత్ ‘ఆదిపురుష్’ వీఎఫ్ఎక్స్ చేయించుకున్నారనే ప్రచారం జరిగింది.