Adire Abhi : జబర్దస్త్ నటుడికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు..

కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన అదిరే అభి ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అలాగే హీరోగా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా అభి హీరోగా చేస్తున్న ఓ సినిమా...........

Adire Abhi : జబర్దస్త్ నటుడికి ప్రమాదం.. చేతికి 15 కుట్లు..

Adire Abhi

Adire Abhi :  ప్రభాస్‌ హీరోగా నటించిన ‘ఈశ్వర్‌’ సినిమాతో నటుడిగా టాలీవుడ్‌కి పరిచయం అయ్యాడు అభినవ్ కృష్ణ. ఆ తర్వాత సినిమాలలో ఛాన్సులు లేక ఉద్యోగం చేసుకొని మళ్ళీ జబర్దస్త్ తో ఎంట్రీ ఇచ్చాడు. జబర్దస్త్ లో అదిరే అభిగా పేరు సంపాదించుకున్నాడు. ఒక పక్క జబర్దస్త్ లో కామెడీ స్కిట్స్ చేస్తూనే మరో పక్క యాంకర్ గా, నటుడిగా, హీరోగా, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో, రచయితగా.. ఇలా పలు రకాలుగా పని చేస్తున్నాడు.

Sai Pallavi : సినిమాలకి గుడ్ బై చెప్పిన తర్వాత ఆ పని చేస్తాను..

కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ నుంచి బయటకి వచ్చిన అదిరే అభి ప్రస్తుతం కామెడీ స్టార్స్ అనే ప్రోగ్రాం చేస్తున్నాడు. అలాగే హీరోగా పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. తాజాగా అభి హీరోగా చేస్తున్న ఓ సినిమా షూటింగ్‌ హైదరాబాద్‌ లో జరుగుతుంది. ఈ సినిమాలోని యాక్షన్‌ సీన్స్‌ని తెరకెక్కిస్తుండగా అభి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన చేతికి, కాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. చేతికి పెద్ద గాయమే అయిందని, దాదాపు 15 కుట్లు పడినట్లు చిత్రయూనిట్‌ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం అభి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. వైద్యుల సలహా మేరకు కొన్ని రోజుల వరకు అభి విశ్రాంతి తీసుకోనున్నారు.