Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..

హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ''థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన క్షణం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక గూడాచారి అయితే నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. అలాగే హిట్ 2 సినిమా.................

Adivi Sesh : హిట్ 2 సినిమాలో కిస్ సీన్స్ చేస్తే మా అమ్మ తిట్టింది..

Adivi Sesh comments on hit 2 movie

Adivi Sesh :  నాని నిర్మాతగా శైలేష్ కొలను దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా హిట్ 2 సినిమా రాబోతుంది. మీనాక్షి చౌదరి, కోమలీ ప్రసాద్ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సస్పెన్స్, థ్రిల్లర్ అంశాలతో ఉండనున్న ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. నేడు డిసెంబర్ 2న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. దీంతో చిత్ర యూనిట్ నిన్నటివరకు ప్రమోషన్స్ తో బిజీగానే ఉన్నారు.

BiggBoss 6 Day 88 : కంటెస్టెంట్స్ ఎవరెవరు బిగ్‌బాస్ కప్పుని ఎందుకు గెలవాలనుకుంటున్నారో తెలుసా??

హీరో అడివిశేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలని పంచుకున్నాడు. అడివి శేష్ మాట్లాడుతూ.. ”థ్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కించిన క్షణం సినిమా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక గూడాచారి అయితే నాకు కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది. అలాగే హిట్ 2 సినిమా కూడా మంచి విజయం సాధిస్తుంది. ఈ సినిమాలో ముద్దు సీన్స్ లో నటించాను. అది తెలిసి అమ్మ నన్ను తిట్టింది. ఫైట్, డ్యాన్స్ లాగే అది కూడా నటనలో ఒక భాగం అని చెప్పాను. హిట్ 3లో కూడా నేను ఉంటాను. హిట్ ప్రాంచైజీ చివరి సినిమా పాన్ ఇండియా లెవెల్లో ఉంటుంది. హిట్ 2 సినిమాని హిందీ, కన్నడలో కూడా త్వరలోనే రిలీజ్ చేయబోతున్నాం” అని తెలిపాడు.