Adivi Sesh : నన్ను ఎడిటింగ్‌లో తీసేసి నిన్ను నువ్వు పెట్టుకుంటున్నావా ట్రైలర్‌లో.. అడివి శేషు!

సస్పెన్స్ థిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్ అడివి శేషు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 'హిట్ - ది సెకండ్ కేస్'. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అవి తారాస్థాయికి చేరుకున్నాయి అనే చెప్పాలి. ఈ 'హిట్ వర్స్'కి దర్శకత్వం వహిస్తున్న శైలేష్ కొలను.. హిట్ 2 టీజర్ తోనే అందర్నీ బయపెట్టేసాడు. కాగా ఇప్పుడు ట్రైలర్ తో మరింత భయపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే...

Adivi Sesh : నన్ను ఎడిటింగ్‌లో తీసేసి నిన్ను నువ్వు పెట్టుకుంటున్నావా ట్రైలర్‌లో.. అడివి శేషు!

Adivi sesh funny tweet on hit 2 trailer

Adivi Sesh : సస్పెన్స్ థిల్లర్ మూవీస్ స్పెషలిస్ట్ అడివి శేషు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘హిట్ – ది సెకండ్ కేస్’. టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని నిర్మాతగా 2020లో నిర్మించిన ‘హిట్ – ది ఫస్ట్ కేస్’కి కొనసాగింపు వస్తుంది. మొదటి భాగం మంచి విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇక ఇటీవల విడుదల చేసిన టీజర్ తో అవి తారాస్థాయికి చేరుకున్నాయి అనే చెప్పాలి.

Adivi Sesh: ‘హిట్-2’పై అడివి శేష్ సాలిడ్ అప్‌డేట్

ఈ ‘హిట్ వర్స్’కి దర్శకత్వం వహిస్తున్న శైలేష్ కొలను.. హిట్ 2 టీజర్ తోనే అందర్నీ బయపెట్టేసాడు. కాగా ఇప్పుడు ట్రైలర్ తో మరింత భయపెట్టడానికి సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలోనే ట్రైలర్ ఫైనల్ కట్ ని రెడీ చేయడానికి ఈరోజు చెన్నై వెళ్ళాడు. కాగా శైలేష్ దిగిన ఒక సెల్ఫీని తన సెల్ఫీతో కంపేర్ చేస్తూ అడివి శేషు ఒక ట్వీట్ చేశాడు. ఆ ఫొటోలో ఇద్దరి స్టైల్ ఒకటిగా ఉండడంతో, శైలేష్ నా స్టైల్ ని కాపీ కొడుతున్నాడు అంటున్నాడు శేషు.

“కొంపదీసి నన్ను ఎడిటింగ్‌లో తీసేసి నిన్ను నువ్వు పెట్టుకుంటున్నావా ట్రైలర్‌లో?” అంటూ ట్వీట్ చేస్తూ.. హిట్ 2 ట్రైలర్ రాబోతుంది అంటూ తెలియజేశాడు. ఈ సినిమాలో అడివి శేషుకి జంటగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. ఇటీవల విడుదలైన ‘ఉరికే ఉరికే’ సాంగ్ లో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కాగా ఈ సినిమా డిసెంబర్ మొదటి వారంలో ఆడియన్స్ ముందుకు రాబోతుంది.