AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

తెలుగు పాపులర్ ఓటీటీ ‘ఆహా’ మరోసారి అందమైన ప్రేమకథను ఆడియన్స్ ముందుకు తీసుకొస్తుంది..

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

Aha Love Story Trailer

AHA: ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ అందిస్తూ టాప్ ప్లేస్‏లో దూసుకుపోతున్న తొలి తెలుగు ఓటీటీ మాధ్యమం.. ‘ఆహా’ మరోసారి అందమైన ప్రేమకథను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తుంది. యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి జంటగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన బ్యూటిఫుల్ మూవీ ‘లవ్ స్టోరీ ’..

Unstoppable Sneak Peak : కలుద్దాం.. ‘ఆహా’లో.. డిజిటల్ స్క్రీన్ దద్దరిల్లాల్సిందే..

ఈ సినిమా అక్టోబర్ 22న సాయంత్రం 6 గంటలకు ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ‘ఆహా’ ఓటీటీ తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా ‘లవ్ స్టోరీ’ ట్రైలర్ డిజిటల్ ట్రైలర్ కూడా విడుదల చేశారు. నాగ చైతన్య.. జుంబా కోచ్ రేవంత్ పాత్రలో.. సాయి పల్లవి మౌనిక క్యారెక్టర్‌లో నటించి మెప్పించారు..

Roja – Balakrishna : బాలయ్యకు రోజా ఫోన్ కాల్.. ‘జబర్దస్త్’కి వస్తానని చెప్పిన నటసింహం..

సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయ్యింది ‘లవ్ స్టోరీ’.. ప్రేక్షకుల భారీ స్థాయిలో హాళ్లకు తరలి వచ్చారు. ఓవర్సీస్‌లోనూ మంచి కలెక్షన్లు రాబట్టింది. ‘లవ్ స్టోరీ’ ఇచ్చిన ఉత్సాహంతోనే కొత్త సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి ముందుకు వచ్చారు టాలీవుడ్ మేకర్స్.