Ajith-Vijay : 9 ఏళ్ళ తర్వాత సంక్రాంతికి ఢీ కొట్టుకోబోతున్న అజిత్, విజయ్.. తమిళ్ లో ఫ్యాన్స్ మధ్య భారీ గొడవలు తప్పవు..

అసలు పచ్చగడ్డి వేయ్యకుండానే భగ్గుమనే అజిత్, విజయ్ ఫాన్స్ ఈ సారి గట్టిగానే ఫైట్ చేస్కోబోతున్నారు. తమిళ్ లో ఎంత మంది హీరోలున్నా అజిత్, విజయ్ సినిమాల్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటారు ఫాన్స్..............

Ajith-Vijay : 9 ఏళ్ళ తర్వాత సంక్రాంతికి ఢీ కొట్టుకోబోతున్న అజిత్, విజయ్.. తమిళ్ లో ఫ్యాన్స్ మధ్య భారీ గొడవలు తప్పవు..

Ajith and vijay big fight for sankranthi after 9 years

Ajith-Vijay :  స్టార్ హీరోల పొంగల్ పోటీ ఏమో కానీ ఈ సారి తమిళ ఫ్యాన్స్ మద్య పెద్ద ఫైట్ అయ్యేలానే కనిపిస్తోంది. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ అంటే జనాలు ఎంత సీరియస్ గా తీసుకుంటారో అజిత్, విజయ్ సినిమాలు ఒకేసారి రిలీజ్ అవుతున్నాయంటే ఈ స్టార్ హీరోల ఫ్యాన్స్ కూడా అంతే సీరియస్ గా తీసుకుంటారు. లేటెస్ట్ గా అజిత్ అనౌన్స్ మెంట్ తో మరోసారి ఫాన్స్ మధ్య సాలిడ్ ఫైట్ జరగబోతోందని తెలుస్తోంది.

అసలు పచ్చగడ్డి వేయ్యకుండానే భగ్గుమనే అజిత్, విజయ్ ఫాన్స్ ఈ సారి గట్టిగానే ఫైట్ చేస్కోబోతున్నారు. తమిళ్ లో ఎంత మంది హీరోలున్నా అజిత్, విజయ్ సినిమాల్ని మాత్రం సీరియస్ గా తీసుకుంటారు ఫాన్స్. మా హీరో తోప్ అంటే మా హీరో తురుమ్ అంటూ తెగ హడావిడి చేస్తారు. ఈసారి ఈ ఫైట్ పీక్స్ కి చేరబోతోంది. 9 ఏళ్ల తర్వాత అజిత్, విజయ్ సినిమాలు రెండూ ఒకే సారి రిలీజ్ కాబోతున్నాయి.

విజయ్ ‘వరిసు’, అజిత్ ‘తునివు’ సినిమాలు పొంగల్ వార్ కి పోటీపడుతున్నాయి. విజయ్, వంశీ పైడిపల్లి డైరెక్షన్లో దిల్ రాజు ప్రొడ్యూసర్ గా తెరకెక్కుతున్న వరిసు సినిమా సంక్రాంతికి రిలీజ్ అని ఎప్పుడో అనౌన్స్ చేశారు. మోర్ ద్యాన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అంటూ హైప్స్ పెంచేస్తున్న ఈ మూవీ లేటెస్ట్ గా దీపావళికి పోస్టర్ లో కూడా సంక్రాంతికే రిలీజ్ అని తేల్చేసింది. ఆల్రెడీ తెలుగులో స్టార్ హీరోల సినిమాలు పోటీగా ఉన్నా కూడా సంక్రాంతికే వస్తున్న విజయ్ సేఫ్ సైడ్ గా డేట్ మాత్రం లాక్ చెయ్యలేదు.

 

అసలే సంక్రాంతికి టైట్ ఫైట్ జరుగుతోందని అనుకుంటుంటే తమిళ్ నుంచి తల అజిత్ నేను కూడా బరిలో ఉన్ననంటూ లేటెస్ట్ గా అనౌన్స్ చేశారు. వలిమై డైరెక్టర్ హెచ్.వినోత్ తో చేస్తున్న భారీ యాక్షన్ డ్రామా తునివు మూవీని పొంగల్ రేస్ లోకి తెస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. అసలే ఇద్దరు హీరోల ఫాన్స్ మధ్య సోషల్ మీడియాలో కారణం లేకుండానే వార్ జరుగుతూ ఉంటుంది. అలాంటిది 9 ఏళ్ల క్రితం అజిత్ వీరమ్, విజయ్ జిల్లా తర్వాత ఈ ఇద్దరూ సంక్రాంతికి రేస్ లోకి దిగుతున్నారు. ఇప్పటికే మా హీరోదే హిట్ అంటే మా హీరోదే బ్లాక్ బస్టర్ అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి ఒకేసారి రిలీజ్ అయితే తమిళనాడులో ఫ్యాన్స్ మధ్య కచ్చితంగా గొడవలు తప్పవు అని అంటున్నారు తమిళ సినీ వర్గాలు.

Yash : బ్రహ్మాస్త్రలో KGF యశ్?? సూపర్ గాసిప్.. నిజం అయితే..

మరి ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అవుతాయా లేదా ఎవరన్నా వాయిదా వేసుకుంటారా చూడాలి. విజయ్ వరిసు సినిమా తెలుగు రిలీజ్ కూడా ఉంది. తెలుగులో ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణల సినిమాలు ఉండటంతో తెలుగు మార్కెట్ కూడా కావాలంటే వాయిదా వేసుకోక తప్పదు విజయ్. లేదు, పర్లేదు అంటే ఇక సంక్రాంతికి తమిళ్ లో పెద్ద ఫైట్ జరుగుతుంది.