Thunivu: తెగింపుతో దూకుతున్న తమిళ హీరో.. టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

తమిళంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇక ఆయా హీరోలకు ఫ్యాన్ బేస్ కూడా ఆ రేంజ్‌లో ఉండటమే దీనికి కారణమని సినీ వర్గాలు చెబుతుంటాయి. వారే తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్.

Thunivu: తెగింపుతో దూకుతున్న తమిళ హీరో.. టెన్షన్‌లో విజయ్ ఫ్యాన్స్..?

Ajith Thunivu To Give Solid Competition To Vijay Varisu

Thunivu: తమిళంలో ఇద్దరు స్టార్ హీరోల మధ్య పోటీ ఎప్పటికీ కొనసాగుతూనే ఉంది. వారి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఈ పోటీ మరింత తీవ్రతరం అవుతోంది. ఇక ఆయా హీరోలకు ఫ్యాన్ బేస్ కూడా ఆ రేంజ్‌లో ఉండటమే దీనికి కారణమని సినీ వర్గాలు చెబుతుంటాయి. వారే తమిళ స్టార్ హీరోలు విజయ్, అజిత్ కుమార్. ఈ ఇద్దరు హీరోలు వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ దూసుకుపోతున్నారు.

Varisu : దళపతి కోసం పాట పాడడమే కాదు కాలు కూడా కలిపిన శింబు.. మాములుగా లేదుగా పాట!

అయితే తాజాగా మరోసారి ఈ ఇద్దరు హీరోలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అనే రీతిలో పోటీకి సై అంటున్నారు. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘వారిసు’ మూవీ ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాను సంక్రాంతి బరిలో జనవరి 12న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది.

Vijay -Ajith : 9 ఏళ్ల తర్వాత.. బాక్సాఫీస్ వార్​కు రెడీఅయిన తమిళ స్టార్స్

అటు మరో తమిళ హీరో అజిత్ కూడా తన సినిమా ‘తునివు’ను పొంగల్ కానుకగా జనవరి 12న రిలీజ్ చేసేందుకు రెడీ అయ్యాడు. ఇప్పటికే ఓవర్సీస్‌లో రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ త్వరలోనే అఫీషియల్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను ఇక్కడ కూడా అనౌన్స్ చేయనుంది. ఈ రెండు సినిమాలు కూడా తమిళ బాక్సాఫీస్ వద్ద ఢీకొనేందుకు రెడీ కావడంతో తమిళ ఫ్యాన్స్ ఏ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందా అని ఆసక్తిగా చూస్తున్నారు.