Akhanda : ఎట్టకేలకు ఏపీలో బెనిఫిట్ షో.. థియేటర్స్‌లో బాలయ్య మానియా

ఇవాళ బాలయ్య 'అఖండ' సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఏపీలో చాలా చోట్ల బెనిఫ్ట్ షోలు వేయడం విశేషం. రాయలసీమలో చాలా చోట్ల 'అఖండ' బెనిఫిట్ షోలు పడ్డాయి. తెల్లవారు జామున 5.30 కే.....

10TV Telugu News

Akhanda :  న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన మూడో సినిమా `అఖండ`. ఇవాళ ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది. ఏపీలో గత కొన్ని నెలలుగా థియేటర్స్ సమస్యలపై చర్చలు జరుగుతున్నాయి. ఇటీవలే సినీ నియంత్రణ బిల్లుని ఏపీ ప్రభుత్వం పాస్ చేసింది. దీంతో సినిమా టికెట్ ధరలు తగ్గించి, బెనిఫిట్ షోలు, ఎక్సట్రా షోలు క్యాన్సిల్ చేశారు. ఇది సినీ పరిశ్రమకి భారీ నష్టం. ఇవాళ బాలయ్య ‘అఖండ’ సినిమా రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా ఏపీలో చాలా చోట్ల బెనిఫ్ట్ షోలు వేయడం విశేషం.

Akhanda Review: అఘోరాగా ఉగ్రరూపం.. ఊర మాస్ బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

అనంతపురము, కడప, హిందూపురం, డోన్,ఆత్మకూరు, నందికొట్కూరు, ఇలా రాయలసీమలో చాలా చోట్ల ‘అఖండ’ బెనిఫిట్ షోలు పడ్డాయి. తెల్లవారు జామున 5.30 కే బెనిఫిట్ షో ప్రారంభమైంది. సినిమాహాళ్ల వద్ద అభిమానులు కోలాహాలం సృష్టించారు. జై బాలయ్య అంటూ కేరింతలు, విజిల్స్ లతో సినిమా హాల్స్ దద్దరిల్లాయి. ‘అఖండ’ సినిమా బెనిఫిట్ షో టికెట్ ధర 100 నుండి 300 రూపాయల వరకు అమ్మారు.

Ajith : ఇకపై నన్ను ‘తల’ అని పిలవకండి : అజిత్

బాలయ్య నుంచి ఫుల్ మాస్ మూవీ వస్తే ఎలా ఉంటుందో మన అందరికి తెలిసిందే. ఇక బాలయ్య మాస్ కి బోయపాటి తోడైతే ఆ కాంబినేషన్ వేరే లెవెల్. ఈ కాంబినేషన్ ‘అఖండ’తో మరోసారి హ్యాట్రిక్ కొట్టిసినట్టే అంటున్నారు సినిమా చూసిన ప్రేక్షకులు.

×