Akhanda: బాలీవుడ్‌లోకి అఖండ.. హీరో ఎవరంటూ ఆసక్తికర చర్చ!

నటసింహం నోటి నుండి పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. బీబీ3 హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు..

Akhanda: బాలీవుడ్‌లోకి అఖండ.. హీరో ఎవరంటూ ఆసక్తికర చర్చ!

Akhanda

Akhanda: నటసింహం నోటి నుండి పవర్ ఫుల్ డైలాగ్స్ తో మోత మోగిపోతున్న ధియేటర్లు.. పవర్ ఫుల్ పంచ్ లతో దద్దరిల్లిపోతున్న స్క్రీన్లు.. బీబీ3 హ్యాట్రిక్ సక్సెస్ తో ఫుల్ ఖుష్ అవుతున్న అభిమానులు.. కలెక్షన్లతో నిండిపోతున్న బాక్సాఫీసులు.. ఇవీ అఖండ సినిమా రిలీజ్ అయిన తర్వాత అటు ధియేటర్లో, ఇటు ఫ్యాన్స్ లో కనిపిస్తున్నసీన్లు. బోయపాటి -బాలయ్య కాంబినేషన్లో మూడో సినిమాగా భారీగా రిలీజ్ అయిన అఖండ భారీ సక్సెస్ అందుకుని టాలీవుడ్ కి కొత్త ఊపు తెచ్చింది. ఇప్పుడు ఎక్కడా విన్నా అఖండ గురించే చర్చ.

Vishnu Priya: గుండెలు తీసిన రాణి ఈ విష్ణు ప్రియా!

కాగా, ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా టాలీవుడ్ వైపు చూస్తుంది. తెలుగులో ఏ సినిమా వచ్చినా బాలీవుడ్ ఓ కంట కనిపెట్టి ఉంటుంది. కరోనా తర్వాత ఇలా భారీ బోణీ కొట్టిన అఖండ గురించి ఆరా తీసిన బాలీవుడ్ ఇప్పుడు ఈ సినిమాని అక్కడ రీమేక్ చేసేందుకు కొందరు ప్రయత్నాలు మొదలు పెట్టారట. అఖండ క‌థ ప‌రంగా చూసుకుంటే అంత గొప్ప‌గా ఏమీ ఉండ‌దు. కానీ ఇలాంటి మ‌సాలా సినిమాల‌నే సాజిద్ న‌డియాడ్ వాలా లాంటి నిర్మాత‌లు టేక‌ప్ చేసి, బాలీవుడ్ ట‌చ్ ఇచ్చి వ‌సూళ్ల పంట పండించుకుంటున్నారు.

Bindu Madhavi: తెలుగింటి ఆవకాయ బిర్యానీ బిందు మాధవి!

ఇలా సాజిద్ స‌హా కొంద‌రు నిర్మాత‌లు అఖండ మీద దృష్టి పెట్టినట్లు గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. అఖండలో దేవాల‌యాల ప‌రిర‌క్ష‌ణ, హిందుత్వం గురించి బ‌లమైన సీన్లు కొన్ని ఉండడం నార్త్ ఇండియ‌న్ ఆడియ‌న్స్ ని ఆకర్షించే ఛాన్స్ ఎక్కువగా ఉండడం కూడా మేకర్స్ దృష్టిని ఆకర్షిస్తుంది. సహజంగా మతాలు, సంప్రదాయాలను పెద్దగా పట్టించుకోకుండా సినిమాలు తెరకెక్కించే బాలీవుడ్ మేకర్స్.. ఈసారి అఖండ లాంటి సినిమాతో పోయిన సంప్రాయాలను మళ్ళీ గుర్తు చేసినా ఆశ్చర్యం లేదని టాక్ మొదలైంది.

Anchor Ravi: ఆ రూ.45 లక్షలు.. మోసపోయిన రవికి అదే బాధ!

అయితే.. అఖండ సినిమాలో బాలయ్య విశ్వరూపం సినిమాకే హైలెట్. ఒక్క మాటలో చెప్పాలంటే బాలయ్య కాకుండా ఈ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టమనే మాటలు వినిపించాయి. మరి బాలీవుడ్ రీమేక్ లో హీరో ఎవరు అంటూ మరో చర్చ కూడా జరుగుతుంది. అజ‌య్ దేవ‌గ‌ణ్ లాంటి హీరో అయితే దీనికి ప‌ర్ఫెక్ట్‌గా సెట్ అవుతాడ‌ని.. కథలో కొన్ని మార్పులు, చేర్పులు చేసి దీన్ని తెరపైకి తేవడం చాలా సులభమని ఇండస్ట్రీ నుండి వినిపిస్తున్న మాట. మరి ఇది ఎంతవరకు నిజమవుతుందో చూడాలి.