Akhil Akkineni : లవర్ బాయ్ అఖిల్ ఏజెంట్ తో యాక్షన్ హీరో అవుతాడా??

మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూశాడు అక్కినేని అఖిల్. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అందుకే లవర్ బాయ్ గా మిగతా 3 సినిమాలు చేశాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా ‘ఏజెంట్’ తో..............

Akhil Akkineni : లవర్ బాయ్ అఖిల్ ఏజెంట్ తో యాక్షన్ హీరో అవుతాడా??

Akhil Akkineni wants to be action hero with agent movie

Akhil Akkineni :  మొదటి సినిమాతోనే మాస్ ఇమేజ్ తెచ్చుకోవాలని చూశాడు అక్కినేని అఖిల్. కానీ అది వర్క్ అవుట్ కాలేదు. అందుకే లవర్ బాయ్ గా మిగతా 3 సినిమాలు చేశాడు. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాతో మొదటి కమర్షియల్ హిట్ అందుకున్న అఖిల్ తన నెక్స్ట్ సినిమా ‘ఏజెంట్’ తో స్టార్ ఇమేజ్ పై గురి పెట్టి ఈసారి కాన్ఫిడెంట్ గా యాక్షన్ హీరో అవ్వాలనుకుంటున్నాడు..

టాలీవుడ్ స్టార్ వారసులందరిలో కెరీర్ పరంగా ఎక్కువ ట్రబుల్ పడ్డ హీరో అఖిల్ అక్కినేని. హైయస్ట్ అంచనాలు పెట్టుకొన్న డెబ్యూ మూవీ ‘అఖిల్’ డిజాస్టర్ అయింది. యాక్షన్ ఇమేజ్ కోసం చూసి దెబ్బతిన్న అఖిల్ ఆ తర్వాత లవ్ స్టోరీస్ నే సెలెక్ట్ చేసుకున్నాడు. ఈ ప్రాసెస్ లో ‘మిస్టర్ మజ్ను, హలో’ సినిమాలు రెండూ ఫ్లాప్ అయ్యాయి. నాలుగో ప్రయత్నంగా చేసిన మరో లవ్ స్టోరీ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా ఓ మోస్తరు విజయం సాధించి అఖిల్ కి హిట్ ఇచ్చి కెరీర్ ని నిలబెట్టింది.

ఇప్పుడు మళ్ళీ ఏజెంట్ సినిమాతో యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ట్రై చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా కోసం జుట్టు బాగా పెంచుకొని, సిక్స్ ప్యాక్ తెచ్చుకొని యాక్షన్ హీరో ఎలా కనపడాలో అలా కనపడేలా తయారయ్యాడు. అఖిల్ కెరీర్ లోనే హైయస్ట్ బడ్జెట్ మూవీగా ‘ఏజెంట్’ తెరకెక్కుతుంది. స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ సురేంద్ర రెడ్డి తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.

Vijay-Naresh : ఉగ్రం టీజర్ లాంచ్‌లో.. అదే డైరెక్టర్‌తో మూడో సినిమా కూడా ప్రకటించిన అల్లరి నరేష్

ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్ర చేస్తుండగా, సాక్షి వైద్య హీరోయిన్ గా టాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ కాబోతోంది. హిప్ హాప్ తమీజా ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. అఖిల్ ఈ సినిమాలో ఫుల్ లెంగ్త్ మాస్ రోల్ లో కనిపించబోతున్నట్టు సమాచారం. అలాగే ఈ సినిమాని పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో ‘ఏజెంట్’ మూవీ అఖిల్ కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా కానుంది. ఇటీవల రిలీజయిన ఏజెంట్ గ్లింప్స్, టీజర్స్ సినిమాపై అంచనాలని పెంచేశాయి. ఏప్రిల్ 28న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరి ‘ఏజెంట్’ సినిమా కోసం బాగా కష్టపడ్డా అఖిల్ భారీ యాక్షన్ సీక్వెన్స్ లతో ఈ సినిమాతో ప్రేక్షకులని ఎంతవరకు మెప్పిస్తాడా చూడాలి. ఈ సినిమాతో హిట్ కొట్టి యాక్షన్ ఇమేజ్ తెచ్చుకుంటాడేమో చూడాలి.