Akkineni Nagarjuna : విజయవాడ ఎంపీగా అక్కినేని నాగార్జున పోటీ..? పొలిటికల్ ఎంట్రీపై నాగ్ క్లారిటీ

విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. 15ఏళ్లుగా ఇలాంటి ప్రచారం జరుగుతోందని, దాన్ని తాను అస్సలు పట్టించుకోనన్నారు.

Akkineni Nagarjuna : విజయవాడ ఎంపీగా అక్కినేని నాగార్జున పోటీ..? పొలిటికల్ ఎంట్రీపై నాగ్ క్లారిటీ

Akkineni Nagarjuna : విజయవాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు అక్కినేని నాగార్జున. 15ఏళ్లుగా ఇలాంటి ప్రచారం జరుగుతోందని, దాన్ని తాను అస్సలు పట్టించుకోనన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఎన్నికలు వచ్చిన ప్రతీసారి తాను పోటీ చేస్తానంటూ ప్రచారం జరగడం కామన్ గా మారిందన్న నాగార్జున.. తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. మంచి కథ వస్తే పొలిటికల్ లీడర్ గా నటిస్తానన్నారు. పాలిటిక్స్ ప్రస్తావన తీసుకుని రాగా.. ఎందుకమ్మా.. హాయిగా ఉన్నాను నేను అని నవ్వుతూ బదులిచ్చారు నాగ్. ”ద ఘోస్ట్” సినిమా ట్రైలర్ లాంచ్ ప్రెస్ మీట్ లో నాగార్జున ఈ వ్యాఖ్యలు చేశారు.

ద ఘోస్ట్ సినిమా ప్రమోషన్ లో భాగంగా మీడియాతో మాట్లాడుతూ నాగార్జున ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా ప్రమోషన్ లో మీడియా అడిగిన ప్రశ్నలకు నాగ్ సమాధానం ఇచ్చారు. ఈ క్రమంలో పొలిటికల్ ఎంట్రీపై మీడియా ప్రతినిధి నుంచి నాగార్జునకు ప్రశ్న ఎదురైంది. విజయవాడ ఎంపీగా మీరు పోటీ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అది నిజమేనా? అని మీడియా ప్రతినిధి నాగ్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన నాగార్జున.. ముందుగా నవ్వారు. ఆ తర్వాత అందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఈ ప్రచారం గత పదిహేనేళ్లుగా జరుగుతోందన్నారు. ప్రస్తుతానికి తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానని వెల్లడించారు. తద్వారా పాలిటిక్స్ లోకి రావడం లేదని తేల్చి చెప్పారు నాగ్. అదే సమయంలో మంచి స్క్రిప్ట్, వివాదం కానిది అయితే.. కచ్చితంగా సినిమాల్లో పొలిటికల్ లీడర్ గా నటించేందుకు తాను ఇంట్రస్ట్ గా ఉన్నట్లు నాగ్ చెప్పారు.