అక్షయ్, సుదీప్ మొదలు పెట్టేశారు.. మరి మనవాళ్లు ఎప్పుడంటే!..

  • Published By: sekhar ,Published On : July 27, 2020 / 04:53 PM IST
అక్షయ్, సుదీప్ మొదలు పెట్టేశారు.. మరి మనవాళ్లు ఎప్పుడంటే!..

కరోనా కారణంగా పలు ఇండస్ట్రీలలో షూటింగులు తాత్కాలికంగా నిలిచిపోయాయి. ఇటీవల తిరిగి కొన్ని సీరియల్స్ షూటింగులు స్టార్ట్ అయ్యాయి కానీ కేసులు పెరగడంతో చాలా వరకు ఆపేశారు. థియేటర్లు, షూటింగులు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయోనని స్టార్స్, మేకర్స్, టెక్నీషియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు.

ఈ కోవిడ్-19 టైం లో షూటింగులు చేసే సాహసం ఎవరూ చేయట్లేదు.. అయితే షూటింగ్ చేయడానికి ఎవ‌రు భ‌య‌ప‌డ్డా! తానేం త‌గ్గేది లేదు అంటున్నాడు బాలీవుడ్ కిలాడీ అక్షయ్ కుమార్.. అక్షయ్ డేర్ చేసి షూటింగ్ చేయడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయింది. లాక్‌డౌన్ సమయంలో అక్షయ్ ఆరు కమర్షియల్స్ షూటింగులో పాల్గొన్నాడు. కేవలం 9 రోజుల్లోనే ఈ ఆరు యాడ్స్ పూర్తి చేయడం విశేషం.

Akshay Kumar

ఇప్పుడు తన అప్‌కమింగ్ మూవీ Bell Bottom షూటింగ్‌కి రెడీ అవుతున్నాడు. స్కాట్లాండ్‌లో లిమిటెడ్ టెక్నీషియన్స్‌తో ‘బెల్ బాటమ్’ షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. కేవలం 30-35 మంది టెక్నీషియన్స్‌తో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడి రూల్స్ ప్రకారం షూటింగ్ చేయడానికి యూనిట్ ఏర్పాట్లు చేసుకుంది. బాలీవుడ్ సినీ వర్గాల వారు అక్షయ్ ధైర్యానికి హ్యాట్సాఫ్ అంటున్నారు.Kichcha Sudeepఅక్షయ్‌లాగే కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కూడా ముందడుగేశాడు. ఆయ‌న‌ హీరోగా నటిస్తున్న ‘ఫాంటమ్’ మూవీ షూటింగ్‌ను ఇటీవలే హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోలో ప్రారంభించారు. బాలీవుడ్, శాండల్‌వుడ్ వాళ్లు షూటింగులు మొదలుపెట్టేశారు.. మన టాలీవుడ్ వాళ్లు ఎప్పుడు మొదలు పెడతారో అని తెలుగు సినీ జనాలు ఎదురు చూస్తున్నారు.