అల్లరి నరేష్ ఆలోచన అదుర్స్ కదూ!..

కరోనా ఎఫెక్ట్ : ‘నాంది’ సినిమా యూనిట్‌లోని 50 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున సాయం ప్రకటించిన అల్లరి నరేష్..

  • Published By: sekhar ,Published On : March 26, 2020 / 03:15 PM IST
అల్లరి నరేష్ ఆలోచన అదుర్స్ కదూ!..

కరోనా ఎఫెక్ట్ : ‘నాంది’ సినిమా యూనిట్‌లోని 50 మందికి ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున సాయం ప్రకటించిన అల్లరి నరేష్..

‪తన ‘నాంది’ సినిమా కోసం పని చేస్తున్న 50 మంది కార్మికులకు తలా ఒక్కొక్కరికి 10 వేల సాయం ప్రకటించిన హీరో అల్లరి నరేష్, చిత్ర నిర్మాత వేగేశ్న సతీష్. కోవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి అందరూ కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిస్తూ.. stay Home and Stay Safe అంటూ పలువురు సినీ ప్రముఖులు తమ వంతు సాయం చేస్తున్నారు. ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయనిధికి (రెండు తెలుగు రాష్ట్రాలు) విరాళాలు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో యువ నటుడు అల్లరి నరేష్, తను నటిస్తున్న ‘నాంది’ చిత్ర బృందానికి సహాయం చేయడానికి ముందుకొచ్చారు. నిర్మాత సతీష్ వేగేశ్నతో కలిసి రోజువారి వేతనానికి పనిచేస్తున్న వారికి ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందిచనున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా నరేష్ మాట్లాడుతూ : ‘‘కరోనా వైరస్ కారణంగా దేశమంతా లాక్‌డౌన్ ప్రకటించిన నేపథ్యంలో నేను, నిర్మాత సతీష్ వేగేశ్న గారు కలిసి మా నాంది టీమ్‌లో వివిధ శాఖలలో పని చేస్తున్న వారికి పది వేలు చొప్పున ఇద్దామని డిసైడ్ అయ్యాం.

నాకేదో క్రెడిట్ రావాలని ఈ వీడియో చేయడం లేదు. నన్ను ఇష్టపడే వాళ్లు ఓ ఐదు, పది మందిని అయినా ఫాలో అవుతారని ఆశతో చేస్తున్నాను. అలాగే చాలామంది తమ ఇళ్లల్లో పనివాళ్లను రావద్దని చెప్పారట.. మంచిది.. కానీ వాళ్ల జీతాలు మాత్రం కట్ చేయకండి. వాళ్ళకదే జీవనాధారం’’ అంటూ వీడియో విడుదల చేసాడు అల్లరి నరేష్.