Allu Arjun : తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ పై బన్నీ ఎమోషనల్ కామెంట్స్..
తెలుగు ఇండియన్ ఐడల్ 2 విన్నర్ టైటిల్ ని సౌజన్య సొంతం చేసుకుంది. ఇక ఆమెకు టైటిల్ ని అందజేసిన అల్లు అర్జున్ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

Allu Arjun emotional comments on Aha Telugu Indian Idol 2 winner
Allu Arjun – Telugu Indian Idol 2 : తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న సింగింగ్ కంపిటిషన్ షో తెలుగు ఇండియన్ ఐడల్ (Telugu Indian Idol) మంచి ప్రజాధారణ అందుకుంది. మొదటి సీజన్ సూపర్ హిట్ అవ్వడంతో నిర్వాహకులు సెకండ్ సీజన్ ని మరింత గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు. ఈ క్రమంలోనే సెకండ్ సీజన్ ని బాలకృష్ణ (Balakrishna) తో స్టార్ట్ చేయించారు. రెండో సీజన్ లోని కంటెస్టెంట్స్ ని బాలయ్య ప్రేక్షకులకు పరిచయం చేశాడు. మార్చిలో మొదలైన ఈ సీజన్ 5 కంటెస్టెంట్స్ తో ఫైనల్ కి చేరుకుంది.
Tom Holland – RRR : ఆర్ఆర్ఆర్ పై స్పైడర్ మ్యాన్ కామెంట్స్.. స్పైడర్ మ్యాన్ 4 అప్డేట్ తెలుసా?
ఇక గత సీజన్ కి గెస్ట్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) వచ్చి విన్నర్ ని అనౌన్స్ చేస్తే.. ఈసారి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అతిథిగా వచ్చాడు. ఈ ఫైనల్ కి సంబంధించిన ఎపిసోడ్స్ నిన్న ఇవాళ (జూన్ 3-4) ప్రసారం అయ్యాయి. బన్నీ ఎంట్రీతో ఫైనల్ చాలా సరదాగా సాగింది. అల్లు అర్జున్ తన ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరుని రివీల్ చేయడంతో ఎపిసోడ్స్ అంతా ఆ టాపిక్ తో చాలా ఇంటరెస్టింగ్ సాగింది. కాగా ఈ సెకండ్ సీజన్ టైటిల్ ని ‘సౌజన్య’ సొంతం చేసుకుంది. టైటిల్ తో పాటు 10 లక్షల నగదు బహుమతిని అల్లు అర్జున్ ఆమెకు అందజేశాడు. అలాగే ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్ కి 3లక్షలు, సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్యకు 2 లక్షల చెక్‌ను అందించాడు.
NTR – Ram Charan : ప్రశాంత్ నీల్‌కి చరణ్ విషెస్.. ఎన్టీఆర్ నాటుకోడి పులుసు ట్రీట్..
ఆ తరువాత బన్నీ ఆమె గురించి మాట్లాడుతూ.. “మీరు విన్నర్ గా నిలవడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించడం అనేది సాధారణంగా జరుగుతుంది. కానీ ఇక్కడ భర్త, అత్తింటి వాళ్లు సపోర్ట్ చేయడం విశేషం. మెట్టింటి వాళ్లు ప్రోత్సహిస్తే ఒక మహిళ గొప్ప విజయాల్ని అందుకోవచ్చని మీరు నిరూపించి ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారు” అంటూ వ్యాఖ్యానించాడు.