Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంతో అల్లు వారి అనుబంధం ఈనాటిది కాదు. మా తాతయ్య అల్లు రామలింగయ్యకు సీనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుభందం.......

Akhanda : బాలకృష్ణలాగా డైలాగ్స్ చెప్పేవాళ్ళు ఇండస్ట్రీలో ఎవరూ లేరు: అల్లు అర్జున్

Balayya

Akhanda :  బాలకృష్ణ బోయపాటి కాంబినేషన్ లో రాబోతున్న మూడో సినిమా ‘అఖండ’. నిన్న ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఫంక్షన్ కి అల్లు అర్జున్, రాజమౌళిలు గెస్టులుగా వచ్చారు. ఈ సినిమా డిసెంబర్ 2న రిలీజ్ అవుతుంది. బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో మూడో సినిమా అవ్వడంతో కచ్చితంగా హ్యాట్రిక్ కొడతారని భావిస్తున్నారు అభిమానులు. నిన్న ఫంక్షన్ లో బాలయ్య అభిమానులతో పాటు, అల్లు అర్జున్ అభిమానులు కూడా సందడి చేశారు.

Akhanda: జగన్, కేసీఆర్‌కు.. బాలకృష్ణ స్పెషల్ రిక్వెస్ట్..!

ఈ ప్రి రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. నందమూరి కుటుంబంతో అల్లు వారి అనుబంధం ఈనాటిది కాదు. మా తాతయ్య అల్లు రామలింగయ్యకు సీనియర్ ఎన్టీఆర్ తో మంచి అనుభందం ఉంది. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగాను. మా నాన్న, బాలకృష్ణ గారు ఒకే జనరేషన్ కి చెందిన వారు. ఇవాళ ఇంత పెద్ద స్టార్ సినిమాకు గెస్ట్ గా రావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Bigg Boss 5: నన్ను వదిలేస్తున్నావా.. సిరికి బాయ్ ఫ్రెండ్ సూటి ప్రశ్న!

ఇక బాలయ్య గురించి చెప్తూ.. ఇండస్ట్రీలో భారీ డైలాగులను బాలకృష్ణ చెప్పినట్టుగా ఇంకెవరూ చెప్పలేరు. ఆయనకి సినిమా మీద అడిక్షన్ అలాంటిది. ఆయన సినిమాల్లో డిక్షన్ పక్కాగా ఉంటుంది. కెమెరా ముందు అయినా వెనుక అయినా ఎప్పుడూ ఒకేలా ఉండడం బాలయ్యకి మాత్రమే సాధ్యం. ట్రైలర్ చూడగానే చాలా అద్భుతం అనిపించింది. మంచి మాస్ ఎంటర్టైనర్ గా ఉండబోతుంది అని అన్నారు. చివర్లో వెళ్లేముందు మీ అందరి కోసం అని చెప్పి జై బాలయ్య అన్నారు అల్లు అర్జున్.