Pushpa2: పుష్ప సెట్స్ నుండి బన్నీ ఫోటో.. స్టైల్ కా బాప్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. తాజాగా పుష్ప-2 సెట్స్ నుండి బన్నీ లుక్‌కు సంబంధించి ఓ ఫోటో లీక్ అయ్యింది.

Pushpa2: పుష్ప సెట్స్ నుండి బన్నీ ఫోటో.. స్టైల్ కా బాప్!

Allu Arjun Still From Pushpa 2 Sets Goes Viral

Pushpa 2: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి క్రేజ్ నెలకొల్పిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ ఎప్పుడెప్పుడు షూటింగ్ పూర్తి చేసుకుంటుందా.. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Pushpa 2: శేషాచలం నుండి థాయ్‌లాండ్‌కు మారిన పుష్ప స్మగ్లింగ్.. నిజమేనా?

ఇక ఇప్పటికే అఫీషియల్‌గా ఈ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్, తాజాగా బన్నీకి సంబంధించిన సీక్వెన్స్‌లను చిత్రీకరించేందుకు సిద్ధమయ్యింది. అయితే ఈ సినిమాలో బన్నీ లుక్ మొదటి భాగం కంటే కూడా డిఫరెంట్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే టెస్ట్ స్క్రీనింగ్ కూడా జరిపింది చిత్ర యూనిట్. అయితే తాజాగా పుష్ప-2 సెట్స్ నుండి బన్నీ లుక్‌కు సంబంధించి ఓ ఫోటో లీక్ అయ్యింది.

Pushpa 2 : బాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలని బీట్ చేసిన పుష్ప 2

ఈ ఫొటోలో బన్నీ చాలా స్టైలిష్‌గా కనిపిస్తున్నాడు. దీన్నిబట్టి చూస్తే, తొలిభాగంలో బన్నీ ఊరమాస్ అవతారంలో కనిపించగా, రెండో భాగంలో స్టైలిష్‌గా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.