Pushpa 2: పుష్ప-2 టీజర్ లోడ్ చేస్తోన్న సుకుమార్.. రిలీజ్ ఎప్పుడంటే..?

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప - ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు ప్రేక్షకులను ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ ఈ మూవీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Pushpa 2: పుష్ప-2 టీజర్ లోడ్ చేస్తోన్న సుకుమార్.. రిలీజ్ ఎప్పుడంటే..?

Allu Arjun Sukumar Pushpa 2 Teaser To Come Out On This Day

Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా వచ్చిన ‘పుష్ప – ది రైజ్’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు సుకుమార్ మలిచిన తీరు ప్రేక్షకులను ఈ సినిమాను చూసేందుకు థియేటర్లకు క్యూ కట్టేలా చేశాయి. ఇక ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్ ఈ మూవీని నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది.

Pushpa 2: మళ్లీ డిసెంబర్ నెలపై కన్నేసిన పుష్పరాజ్

ఈ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో బన్నీ విధ్వంసకరమైన పర్ఫార్మెన్స్ ప్రేక్షకులకు బాగా ఎక్కేసింది. దీంతో ఈ సినిమాకు సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప – ది రూల్’ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోండగా ఈ సినిమా నుండి త్వరలోనే ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చేందుకు సుకుమార్ అండ్ టీమ్ రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Pushpa 2 : పుష్ప-2లో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి.. నిజమేనా?

ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు కానుకగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేసేందుకు సుకుమార్ అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లుగా చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోండగా, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తుండగా, ఈయేడాది చివరినాటికి ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది.