కాళ్లు, చేతులు కట్టేశారు భయంగా ఉంది- అమలాపాల్
నా కాళ్లు, చేతులు కట్టిపడేశారు నాకు భయంగా ఉంది అంటోంది అమలాపాల్. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

నా కాళ్లు, చేతులు కట్టిపడేశారు నాకు భయంగా ఉంది అంటోంది అమలాపాల్. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
నా కాళ్లు, చేతులు కట్టిపడేశారు నాకు భయంగా ఉంది అంటోంది అమలాపాల్. ఈ మేరకు ఆమె విడుదల చేసిన ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కంగారు పడాల్సింది ఏమీ లేదు. ఇదంతా ఆమె కథానాయికగా నటిస్తున్న ‘అదో అంద పరవై పోల’ సినిమా కోసమే. సెంచురి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ బ్యానరు పై జోన్స్ నిర్మిస్తున్న చిత్రం ‘అదో అంద పరవై పోల’.
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి
ఈ మూవీతో కేఆర్ వినోద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రంలో అమలాపాల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. అడ్వెంచర్, థ్రిల్లర్ కథాంశంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. కేరళ, కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో కూడా ఈ సినిమాని విడుదల చేయనున్నారు.
ఇందులో వైల్డ్ లైఫ్ ఫొటోగ్రాఫర్‌గా ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ఆమె ఓ అడవిలో రైడింగ్‌కు వెళ్లి చిక్కుకుంటారు. అక్కడ ఎన్నో సమస్యలు ఎదురవుతాయి. అక్కడి క్రూర మృగాల నుంచి ఆమె ఎలా తప్పించుకున్నారన్నదే చిత్ర కథ. ఇక ఇటీవల అమల ‘కడవేర్’ అనే సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. ఇందులో ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్నారు.
Read Also : లక్ష్మీస్ NTR సినిమాను చూడనున్న న్యాయమూర్తులు