Vikram : కమల్ హాసన్ సినిమాలో అమితాబ్??

'విక్రమ్' సినిమాని జూన్ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా...

Vikram :  కమల్ హాసన్ సినిమాలో అమితాబ్??

Amithab

 

Kamal Haasan :  లోక నాయకుడు కమల్ హాసన్, విలక్షణ నటులు విజయ్ సేతుపతి, ఫాహిద్ ఫాజిల్ తో భారీ మల్టీస్టారర్ గా ‘విక్రమ్’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఖైదీ, మాస్టర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన యువ ట్యాలెంటెడ్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ‘విక్రమ్’ షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ‘విక్రమ్’ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ కి భారీ స్పందన వచ్చింది.

‘విక్రమ్’ సినిమాని జూన్ 3న విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఈ ముగ్గురు స్టార్ హీరోల అభిమానులతో పాటు సినీ అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ సినిమా విషయంలో ఓ న్యూస్ తమిళ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇప్పటికే ముగ్గురు హీరోలతో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ‘విక్రమ్’ సినిమాలో మరో స్టార్ హీరో కూడా ఉండనున్నట్టు తెలుస్తుంది.

RRR : ‘ఆర్ఆర్ఆర్’పై పలువురు సెలబ్రిటీల ట్వీట్లు

బాలీవుడ్ బిగ్ బి అమితామ్ ‘విక్రమ్’ సినిమాలో అతిధి పాత్ర చేయనున్నారు అని సమాచారం. సినిమా క్లైమాక్స్ లో ఓ సన్నివేశంలో అమితాబ్ కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. క‌మ‌ల్ హాస‌న్ కోరిక మేరకు బిగ్‌బీ ఈ చిత్రంలో న‌టించాడ‌ని అంటున్నారు. అయితే దీనిపై అధికారిక సమాచారం రావాల్సి ఉంది. అమితాబ్ గతంలో తెలుగులో మెగాస్టార్ ‘సైరా న‌ర‌సింహారెడ్డి’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించ‌గా, ప్ర‌స్తుతం ప్ర‌భాస్ ‘ప్రాజెక్ట్‌-K’ లో కూడా ఓ ప్రధాన పాత్ర‌లో నటిస్తున్నారు.