Anasuya : మీమర్స్, ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నా..

ఇటీవల ఎవరో అనసూయని ఆంటీ అన్నారని పోలీస్ కేసు పెడతా అని చాలా సిల్లీగా సోషల్ మీడియాలో నెటిజన్లతో గొడవ పెట్టుకుంది. అలాగే తన మీద కామెంట్స్ చేసే వాళ్ళను కూడా వదలను, పోలీసులకి ఫిర్యాదు చేశాను అంటూ..............

Anasuya : మీమర్స్, ట్రోలర్స్ కి గట్టి సమాధానం ఇవ్వబోతున్నా..

Anasuya counter to memers and trollers

Anasuya : యాంకర్ గా, యాక్టర్ గా బిజీగా ఉన్న అనసూయ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో పెట్టే పోస్టులు వివాదంగా మారుతూ ఉంటాయి. సాధారణంగా సెలబ్రీల మీద ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తూ ఉంటారు. ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయినా వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు. కాని అనసూయ మాత్రం ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకోని వివాదంగా మారుస్తుంది.

ఇటీవల ఎవరో అనసూయని ఆంటీ అన్నారని పోలీస్ కేసు పెడతా అని చాలా సిల్లీగా సోషల్ మీడియాలో నెటిజన్లతో గొడవ పెట్టుకుంది. అలాగే తన మీద కామెంట్స్ చేసే వాళ్ళను కూడా వదలను, పోలీసులకి ఫిర్యాదు చేశాను అంటూ ట్విట్టర్ లో రెచ్చిపోయింది. దీంతో మీమర్స్, ట్రోలర్స్ అంతా కలిసి ఏకంగా ఆంటీ అనే పదాన్ని ఇండియా వైడ్ ట్రెండ్ చేశారు. ఇంత జరిగినా అనసూయ ఏమాత్రం తగ్గకుండా మళ్ళీ మళ్ళీ పోలీసులకి కంప్లైంట్ చేశాను. త్వరలో మీ అందర్నీ జైల్లో పెడతారు అని వివాదాన్ని ఇంకా పెద్దది చేసింది.

Kantara : ‘కాంతారా’ తెలుగులో కూడా ఊహించని సెన్సేషన్.. ఒక్కరోజులోనే బ్రేక్ ఈవెన్.. ఆశ్చర్యంలో టాలీవుడ్..

ఇది జరిగి కొన్ని రోజులైంది. అందరూ ఈ అంశాన్ని వదిలేశారు. అయినా మళ్ళీ అనసూయనే ఈ వివాదాన్ని బయటకి తీసుకొచ్చింది. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ.. నేను ఓ పని కోసం చాలా కష్టపడుతున్నాను. ఇప్పుడు నేనే చేసే పనికి మీమర్స్, ట్రోలర్స్ ఫౌండేషన్స్ గట్టిగా కదులుతాయి. త్వరలోనే వాళ్ళకి గట్టి దెబ్బ తగులుతుంది అని చెప్పింది. దీంతో అందరూ మర్చిపోయిన దాన్ని మళ్ళీ గుర్తుచేసేసరికి నెటిజన్లు, మీమర్స్ మళ్ళీ ట్రోలింగ్ మొదలుపెట్టారు. చూసి చూడనట్టు వదిలేయాల్సిన కామెంట్స్ ని పట్టుకొని అనసూయ వివాదంగా మారుస్తుందని అంతా వ్యాఖ్యానిస్తున్నారు.