Anchor Ravi : ట్రోల్ చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన యాంకర్ రవి

యాంకర్ రవిపై వేరే కంటెస్టెంట్స్ అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేశారు. అంతే కాక రవి ఫ్యామిలీని కూడా తిడుతూ ట్రోల్ చేశారు. బిగ్ బాస్ లో......

Anchor Ravi : ట్రోల్ చేసే వారిపై పోలీసులకి ఫిర్యాదు చేసిన యాంకర్ రవి

Anchor Ravi

Anchor Ravi :  బుల్లితెర యాంకర్‌ రవి ఇటీవల బిగ్‌బాస్‌-5 లో పార్టిసిపేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే యాంకర్ రవిపై వేరే కంటెస్టెంట్స్ అభిమానులు కొంతమంది సోషల్ మీడియాలో అసభ్యంగా కామెంట్లు పెడుతూ ట్రోల్ చేశారు. అంతే కాక రవి ఫ్యామిలీని కూడా తిడుతూ ట్రోల్ చేశారు. బిగ్ బాస్ లో ఉండగానే ఇది మొదలైంది. హౌస్ నుంచి వచ్చాక కూడా ఈ ట్రోలింగ్ ని ఆపలేదు. రవి దీనిపై సీరియస్ అయి సోషల్ మీడియాలో మాట్లాడినా కూడా కొంతమంది ఈ ట్రోలింగ్ ని ఆపలేదు.

Vicky-Katrina : పెళ్లి తర్వాత మొదటిసారి మీడియాకి చిక్కిన బాలీవుడ్ కొత్తజంట

దీంతో యాంకర్ రవి పోలీసులను ఆశ్రయించారు. తనపై కొందరు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నన్ను నా ఫ్యామిలీని అసభ్యకరమైన పదాలతో తిడుతూ ట్రోల్ చేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. తనపై ఎన్ని కామెంట్స్‌ చేసినా రవి పట్టించుకోలేదు. కానీ కుటుంబ సభ్యులపై కూడా ట్రోల్స్‌ రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అంతే కాక ఆ ఫిర్యాదులో తనని ట్రోల్ చేసిన వారి సోషల్ మీడియా అకౌంట్స్ ని కూడా పేర్కొన్నాడు.