లిప్‌లాక్‌లో తప్పేముంది.. ఎవరో ఒకరు రాజీపడాల్సిందే..

అనిరుధ్‌తో లిప్ లాక్ ఫోటోలు లీకవడం గురించి ఆండ్రియా, హిమాంశు శర్మతో బ్రేకప్ విషయంలో స్పందించిన స్వర భాస్కర్..

10TV Telugu News

అనిరుధ్‌తో లిప్ లాక్ ఫోటోలు లీకవడం గురించి ఆండ్రియా, హిమాంశు శర్మతో బ్రేకప్ విషయంలో స్పందించిన స్వర భాస్కర్..

 

కొద్ది రోజుల క్రితం మీటు ఉద్యమం కంటే సినిమా పరిశ్రమను (కోలీవుడ్) షేక్ చేసింది సుచీ లీక్స్ వ్యవహారం.. సింగర్ సుచిత్ర పేరు మీదుగా జరిగిన ‘సుచీ లీక్స్’ దక్షిణాదిన ఎన్ని వివాదాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖుల వ్యక్తిగత వ్యవహారాలు సుచీ లీక్స్ ద్వారా బయటపడ్డాయి. త్రిష, ఆండ్రియా, ధనుష్, అమలాపాల్, అనిరుధ్, రానా తదితరుల ప్రైవేట్ ఫోటోలు సుచీ లీక్స్ ద్వారా వెలుగులోకి వచ్చాయి. అయితే సుచీ లీక్స్ ద్వారా బయటపడిన మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, గాయని, నటి ఆండ్రియా లిప్‌లాక్ పిక్స్ అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆ ఫోటోల గురించి ఆండ్రియా రెస్పాండ్ అయింది.

‘అవి చాలా కాలం క్రితం తీసిన పిక్స్. మా మధ్య రిలేషన్ ఉంది. అయితే దానిని దాచిపెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే పర్సనల్‌గా ఉండాల్సిన కొన్ని థింగ్స్ పబ్లిక్ కావడమే బాధగా ఉంది. లిప్‌లాక్ గురించి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. అందులో తప్పేం ఉంది. ఆ ఫోటోలు లీకైన తర్వాత అనిరుధ్ నాకు సారీ చెప్పాడు. తనకు తెలియకుండానే ఆ ఫోటోలు బయటకు వచ్చాయని చెప్పాడు’ అని ఆండ్రియా చెప్పింది. గతంలో పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన  ఆండ్రియా, అనిరుధ్ కొద్దిరోజుల తర్వాత బ్రేకప్ అయిపోయారు. 

రచయితతో బ్రేకప్.. నటి క్లారిటీ..
ప్రేమలో ఉన్నపుడు ఒకరి కోసం ఒకరు పద్ధతులు మార్చుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్‌‌లో విలక్షణ నటిగా పేరుతెచ్చుకున్న స్వరభాస్కర్ అన్నారు. ‘రాంఝానా’, ‘తను వెడ్స్‌ మను’, ‘వీరే ది వెడ్డింగ్’ వంటి చిత్రాలతో స్వర నటిగా మంచి గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 2011లో ఓ సినిమా షూటింగ్‌ సమయంలో స్క్రీన్‌ రైటర్‌ హిమాంశు శర్మతో ఆమె ప్రేమలో పడ్డారు. కొన్నాళ్లపాటు రిలేషన్ మొయింటైన్ చేసిన వీరిద్దరు తర్వాత విడిపోయారు. ఈ నేపథ్యంలో ఇటీవల ‘పింక్‌విల్లా’తో మాట్లాడిన స్వరభాస్కర్‌ తన జీవితంలో ప్రేమ- బ్రేకప్‌ గురించి చెప్పుకొచ్చారు. ‘విడిపోవడం అనేది దురదృష్టకరం. అయితే మా విషయంలో ఒకరినికొరు నిందించుకోవడం అనేది జరగలేదు.

మా ఇద్దరిలో ఎవరం ఎలాంటి తప్పు చేయలేదు. మనం ఒక దారిలో ప్రయాణిస్తున్నపుడు అందులో ఎన్నో మలుపులు ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు కలిసి నడుస్తున్నపుడు ఒకరు కుడివైపు.. మరొకరు ఎడమ వైపు వెళ్లాలని అనుకుంటారు. అప్పుడు ఎవరో ఒకరు రాజీ పడాలి. నీతో కలిసి నడుస్తా అని చెప్పాలి. లేదంటే గుడ్‌ బై చెప్పి వెళ్లాలి. మా విషయంలో ఇదే జరిగింది. ఇతరుల అభిప్రాయాలను కూడా మనం గౌరవించాలి. నా జీవితంలో ఇలాంటివి ఎదురైనపుడు నా కుటుంబం, మరియు స్నేహితులు  నాకు అండగా నిలబడ్డారు. కాబట్టి చాలా తొందరగా బాధ నుంచి బయటపడగలిగాను’ అని చెప్పుకొచ్చింది.
 

Read Also : మెగాస్టార్ సి.సి.సి. సంస్థకు వెల్లువెత్తుతున్న విరాళాలు..