Ram Pothineni: రామ్ కోసం బోయపాటి మరొక బ్యూటీని దించుతున్నాడుగా!

యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బోయపాటి తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంద అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Ram Pothineni: రామ్ కోసం బోయపాటి మరొక బ్యూటీని దించుతున్నాడుగా!

Another Actress To Romance Ram Pothineni In Boyapati Sreenu Movie

Ram Pothineni: యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను బోయపాటి తనదైన మార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుంద అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.

Ram Pothineni: బోయపాటి సినిమాలో రామ్ అలా కనిపిస్తాడా..?

ఇప్పటికే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో రామ్-శ్రీలీల కాంబినేషన్ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి నెలకొంది. కాగా, తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ సాయీ మంజ్రేకర్‌ను బోయపాటి తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Ram Pothineni: బోయపాటి కోసం ఫ్యామిలీతో బిజీగా ఉన్న రామ్..!

గతంలో పలు తెలుగు సినిమాల్లో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు రామ్ సరసన మెరవనుండటంతో, ఈ సినిమాలో అమ్మడి పాత్ర ఎలా ఉండబోతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో రామ్‌తో అమ్మడు రొమాన్స్ చేస్తుందా అని అభిమానులు ఆశగా చూస్తున్నారు. మరి ఈ సినిమాలో సాయీ మంజ్రేకర్ పాత్ర ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.