RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ దిశగా ఆల్బమ్ Another record to RRR.. an album reached soon over 1 billion views

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ దిశగా ఆల్బమ్

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే.

RRR: ఆర్ఆర్ఆర్ మరో రికార్డ్.. 1 బిలియన్ వ్యూస్ దిశగా ఆల్బమ్

RRR: దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’. ఈ క్రేజీ మల్టీస్టారర్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వసూళ్ల పరంగా కూడా ‘ఆర్ఆర్ఆర్’ ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ మెస్మరైజ్ చేయగా, కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అదరగొట్టాడు.

RRR: ఓటీటీలో ఆర్ఆర్ఆర్.. పే పర్ వ్యూ మోడల్ లో రిలీజ్ చేస్తారా?

రిలీజ్ కు ముందే సంవత్సరాలుగా సినిమాపై నెలకొన్న ఈ క్రేజ్ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా ప్రభావం ప్రేక్షకులలో కనిపించేది. రిలీజ్ తర్వాత కూడా సినిమా గురించి వదిలిన ప్రతి అప్డేట్ ఓ సంచలన రికార్డులే నమోదు చేసింది. ఇక ఈ సినిమాలో సాంగ్స్ అయితే యూట్యూబ్లో సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా పాటలు యూట్యూబ్ లో రికార్డ్ వ్యూస్ దక్కించుకోగా అది కాస్త ఇప్పుడు మరో మైల్ స్టోన్ అందుకోబోతుంది.

RRR: తారక్ పర్ఫామెన్స్ పీక్స్.. కొమురం భీముడో వీడియో సాంగ్ రిలీజ్

కీరవాణి అందించిన ఈ సినిమా టోటల్ ఆల్బమ్ ఇప్పటికే పెద్ద చార్ట్ బస్టర్ కాగా ఇప్పుడు ఇది అన్ని భాషల్లో కలిపి 1 బిలియన్ వ్యూస్ మార్క్ దిశగా దూసుకెళ్తుంది. లేటెస్ట్ గా ఈ సినిమా ఆల్బమ్ సెన్సేషనల్ మార్క్ 900 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి ఆ రికార్డు 1 బిలియన్ వైపు దూసుకెళ్తుంది. ఇప్పుడు ఫుల్ వీడియో సాంగ్స్ వదలుతుండడంతో బిలియన్ రికార్డు కొట్టడం కూడా త్వరలోనే జరగడం ఖాయం కాగా.. అదే జరిగితే ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో రికార్డు పడ్డట్లే!

×