ఏఎన్ఆర్ అవార్డుల వేడుక: హాజరైన టాప్ సెలబ్రిటీలు

10TV Telugu News

నటసామ్రట్ అక్కినేని నాగేశ్వరరావు ఏర్పాటు చేసిన ప్రతిష్టాత్మక ఏఎన్నార్ నేషనల్ అవార్డ్ కార్యక్రమం నవంబర్ 17, సాయంత్రం 5గంటలకు, అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా ప్రారంభమైంది.

చలన చిత్ర రంగానికి చెందిన ప్రముఖ హీరో, హీరోయిన్లు, ఇతరులు హాజరయ్యారు. వీరికి నటుడు నాగార్జున కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, అవార్డులను అందచేయనున్నారు.

2018వ సంవత్సరానికి గానూ అతిలోక సుందరి, స్వర్గీయ శ్రీదేవి, 2019వ సంవత్సరానికి రేఖ ఈ అవార్డ్‌కి ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రముఖ బాలీవుడ్ నటుడు దేవానంద్ 2006లో మొదటిగా ఈ అవార్డును అందుకున్నారు. 2017లో బాహుబలి దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ అవార్డును అందుకున్నారు.

దేశ వ్యాప్తంగా సినిమా కోసం పనిచేసిన లెజెండరీ నటీనటులను, సాంకేతిక నిపుణులను గుర్తించి వారికి ఈ జాతీయ అవార్డు ఇచ్చి గౌరవిస్తుంటారు. ఇందుకోసం ఒక జ్యూరీని ఏర్పాటు చేశారు. కొన్ని అనివార్యకారణాల వల్ల 2018లో అవార్డును ప్రకటించలేదు.
Read More : రెడ్డి రాజ్యానికి కమ్మ ఫ్యాన్స్ : వర్మపై వల్లభనేని వంశీ కామెంట్స్

×