18 Pages: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న అనుపమ ముంత మసాలా పొడి
టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘18 పేజెస్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య సాగిన లవ్‌ట్రాక్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

18 Pages: టాలీవుడ్‌లో రీసెంట్‌గా రిలీజ్ అయిన రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘18 పేజెస్’ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు పల్నాటి సూర్యప్రతాప్ తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉందంటూ ప్రేక్షకులు ఈ సినిమాకు విజయాన్ని అందించారు. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నిఖిల్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్‌ల మధ్య సాగిన లవ్‌ట్రాక్ ఈ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.
18 Pages: ఓటీటీలోకి వచ్చేసిన నిఖిల్-అనుపమల 18 పేజెస్!
పూర్తి ఎమోషనల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ప్లాట్‌ఫాంలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు వెండితెరపై దక్కిన రెస్పాన్స్ కంటే కూడా ఎక్కువగా ఈ సినిమాను ఓటీటీలో ఆదరిస్తున్నారు. అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ సినిమాకు సంబంధించిన ఓ అంశం బాగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో అనుపమ ముంత మసాలా తినేటప్పుడు, అందులో ఓ పొడి కలుపుకుని తింటుంది. ఆ పొడి కలిపిన ముంత మసాలాను దాన్ని తయారుచేసే అబ్బాయి కూడా తిని బాగుందని అంటాడు.
18 Pages: అదిరిపోయే న్యూస్ చెప్పిన ఆహా.. 18 పేజెస్ డేట్ ఫిక్స్!
అయితే ఆ పొడి ఏమిటనేది మాత్రం సినిమాలో చూపించలేదు. దీంతో ఇప్పుడు నెట్టింట దీని గురించే చర్చ సాగుతోంది. అసలు ముంత మసాలా తయారు చేసే కుర్రాడికి కూడా తెలియని పొడిని అనుపమ కలపడం.. అది బాగుందని తినడంతో.. ఆ పొడి ఏమిటో చెప్పాల్సిందిగా చిత్ర యూనిట్‌ను అభిమానులు ప్రశ్నిస్తున్నారు. దీని గురించి ఓ అభిమాని ఏకంగా నిఖిల్‌ను నేరుగా ప్రశ్నించగా, ఆ పొడి గురించిన సీక్రెట్‌ను ఓ డిలీటెడ్ వీడియో రూపంలో తెలియజేయబోతున్నామని ఆయన సమాధానం ఇచ్చాడు. ఏదేమైనా ప్రస్తుతం అనుపమ ముంత మసాలా పొడి సోషల్ మీడియాను షేక్ చేస్తుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది.