Anushka Shetty: ఉగాది రోజున అనుష్క కూడా ట్రీట్ ఇస్తోందిగా.. ఏమిటో తెలుసా?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఓ వైవిధ్యమైన రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.

Anushka Shetty: ఉగాది రోజున అనుష్క కూడా ట్రీట్ ఇస్తోందిగా.. ఏమిటో తెలుసా?

Anushka Shetty To Give Ugadi Treat From Miss Shetty Mr Polishetty

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి నటిస్తోన్న తాజా చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఇప్పటికే ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పి.మహేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాను ఓ వైవిధ్యమైన రొమాంటిక్ ఎంట‌ర్‌టైనర్ మూవీగా చిత్ర యూనిట్ రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాతో అనుష్క స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తోంది.

Anushka: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో అంచనాలు పెంచేసిన స్వీటీ!

ఈ సినిమాలో ‘జాతిరత్నాలు’ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హీరోగా నటిస్తోండటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అనుష్క ఓ చెఫ్ పాత్రలో నటిస్తుండగా, నవీన్ ఓ స్టాండప్ కమెడియన్ పాత్రలో ప్రేక్షకులను నవ్వించేందుకు రెడీ అవుతున్నాడు. వీరిమధ్య ప్రేమ ఎలాంటి పరిణామాలకు దారితీసిందనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను చిత్ర యూనిట్ తెరకెక్కిస్తోంది.

Anushka Shetty: మూడేళ్ల తరువాత అనుష్క బ్యాక్ టు వర్క్!

ఇక ఈ సినిమా నుండి ఉగాది కానుకగా ఓ అదిరిపోయే ట్రీట్ ఇస్తున్నట్లు అనుష్క తాజాగా పేర్కొంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఉగాది కానుకగా రిలీజ్ చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది. రధన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తోండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది.