Anushka Shetty: మూడేళ్ల తరువాత అనుష్క బ్యాక్ టు వర్క్!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది. 2020లో ఆమె నటించిన ‘నిశబ్దం’ చిత్రం రిలీజ్ అయిన తరువాత ఇప్పటివరకు.....

Anushka Shetty: మూడేళ్ల తరువాత అనుష్క బ్యాక్ టు వర్క్!

Anushka Shetty Back To Work After Three Years

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి సినిమా వచ్చి దాదాపు మూడేళ్లు అవుతుంది. 2020లో ఆమె నటించిన ‘నిశబ్దం’ చిత్రం రిలీజ్ అయిన తరువాత ఇప్పటివరకు ఆమె మరే ఇతర ప్రాజెక్టును కూడా ఓకే చేయలేదు. దీంతో ఆమె తన నెక్ట్స్ ప్రాజెక్టును ఎప్పుడెప్పుడు ప్రారంభిస్తుందా అని ఆమె అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో కలిసి అనుష్క ఓ సినిమాలో నటించబోతుందనే వార్త గతంలో ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్‌మెంట్‌ను నవీన్ పోలిశెట్టి గతేడాదే చేసినా, ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు.

Anushka: జేజెమ్మ కమ్‌బ్యాక్.. సెట్స్‌పైకి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’!

దీంతో ఈ సినిమా అసలు నిజంగానే ఉందా లేదా అనే సందేహం అందరిలో నెలకొంది. అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్‌ను చిత్ర యూనిట్ ప్రారంభించడంతో అనుష్క ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా కోసం.. సోమవారం అనుష్క మూడేళ్ల గ్యాప్ తరువాత బ్యాక్ టు వర్క్ అంటూ షూటింగ్‌కు హాజరయ్యిందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.

Anushka Shetty: అనుష్క చెంతకు నాగరత్నమ్మ..?

ఈ సినిమాలో అనుష్క పాత్ర చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంటుందని, అటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి పాత్ర కూడా ఈ సినిమాకు మరో హైలైట్‌గా ఉంటుందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా అనుష్క ఇంకా వెయిట్ లాస్ సమస్యతో బాధపడుతున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ‘రారా కృష్ణయ్య’ ఫేం దర్శకుడు మహేష్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా, యూవీ క్రియేషన్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు. యూవీ బ్యానర్‌తో అనుష్క మూడో సినిమాగా ఈ చిత్రంలో నటిస్తోంది. గతంలో మిర్చి, భాగమతి చిత్రాల తరువాత ఇప్పుడు మరోసారి యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో అనుష్క ఈ సినిమాలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో ఆమె ఓ 40 ఏళ్ల వయసుగల మహిళగా కనిపించబోతుందట. మరి ఈ సినిమాతో అనుష్క ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో తెలియాలాంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.