Anushka: జేజెమ్మ కమ్‌బ్యాక్.. సెట్స్‌పైకి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’!

మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు జేజమ్మ రెడీ అంటోంది. కొత్త ఏడాదిలో కొత్త సినిమా షూటింగ్ మొదలెట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. నిశ్శబ్ధం తర్వాత పూర్తిగా సైలెంటయిన స్వీటీశెట్టి..

Anushka: జేజెమ్మ కమ్‌బ్యాక్.. సెట్స్‌పైకి ‘మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి’!

Anushka Shetty (image:instagram)

Anushka: మళ్లీ కెమెరా ముందుకొచ్చేందుకు జేజమ్మ రెడీ అంటోంది. కొత్త ఏడాదిలో కొత్త సినిమా షూటింగ్ మొదలెట్టేందుకు డేట్ ఫిక్స్ చేసుకుంది. నిశ్శబ్ధం తర్వాత పూర్తిగా సైలెంటయిన స్వీటీశెట్టి.. 40 ఏళ్ల మహిళగా రచ్చ చేసేందుకు వచ్చేస్తోంది.

Anushka Shetty: అనుష్క చెంతకు నాగరత్నమ్మ..?

యూవీ క్రియేషన్స్ లో అనుష్క కమిటైన హ్యాట్రిక్ మూవీకి ముహూర్తం ఫిక్సయింది. మిర్చి, భాగమతి తర్వాత యూవీ, స్వీటీ కాంబినేషన్ లో కొత్త ప్రాజెక్ట్ ఏప్రిల్ 4 నుంచే సెట్స్ పైకెళ్లబోతుంది. రారా కృష్ణయ్య ఫేం మహేశ్ బాబు పి డైరెక్ట్ చేయబోతున్న ఈ మూవీ అనుష్క నటిస్తోన్న 48వ సినిమా. నిశ్శబ్దం తర్వాత మరో మూవీలో కనిపించని అనుష్కా.. ఇప్పుడిలా ట్రెండీ రోల్ తో ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేయబోతుంది.

Chiranjeevi Anushka: మరోసారి మెగాస్టార్‌తో జతకట్టనున్న జేజెమ్మ!

అనుష్కా లీడ్ రోల్ చేస్తోన్న ఈ ప్రాజెక్ట్ లో మేల్ లీడ్ గా నవీన్ పొలిశెట్టి కనిపించబోతున్నాడు. యంగ్ బాయ్, మిడిల్ ఏజెడ్ వుమెన్ కి మధ్య రిలేషన్ షిప్ అనే న్యూ ఏజ్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతుంది. ఈ మూవీకి మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి అనే టైటిల్ ప్రచారంలో ఉంది. జాతిరత్నాలు తర్వాత కాస్త గ్యాప్ వచ్చినా ఈమధ్యే వరుస సినిమాల కమిట్ మెంట్స్ తో నేను బిజీనే అనిపించుకున్నాడు నవీన్ పొలిశెట్టి.

Anushka Shetty: స్వీటీ మనసు స్వీట్.. అందంలో అప్సరస!

బాహుబలి2 తర్వాత నేషనల్ వైడ్ క్రేజ్ వచ్చినా ఎందుకో ఇంట్రెస్ట్ చూపించలేదు అనుష్కా. నిశ్శభ్దం చేసినా అది ఓటీటీకొచ్చి అడ్రస్ లేకుండా పోయింది. మధ్యలో చాలా గ్యాప్ తీసుకుంది. పెళ్లి చేసుకుంటుందనే వార్తలు వచ్చినా.. అవేమీ నిజం కాలేదు. రీసెంట్ గా ప్రభాస్ తో స్వీటీ పెయిర్ రిపీట్ కాబోతుందనే వార్తలొచ్చాయి. కానీ అఫీషియల్ గా మాత్రం నవీన్ పొలిశెట్టితో చేసే సినిమా మాత్రమే ఎట్టకేలకు సెట్స్ పైకెళ్తోంది.