Anushka Shetty: అనుష్క చెంతకు నాగరత్నమ్మ..?

టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి బాహుబలి సిరీస్ తరువాత సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తూ వస్తోంది.

Anushka Shetty: అనుష్క చెంతకు నాగరత్నమ్మ..?

Anushka As Nagaratnamma

Anushka Shetty: టాలీవుడ్ స్టార్ బ్యూటీ అనుష్క శెట్టి బాహుబలి సిరీస్ తరువాత సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తూ వస్తోంది. కేవలం లేడీ ఓరియెంటెడ్ సబ్జెక్టులకే అమ్మడు ప్రాధాన్యతను ఇస్తూ వస్తుండటంతో ఆమె సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేకపోయాయి. ఇక కథల ఎంపికలో కూడా అనుష్క ఒకేరకమైన పంథాను అనుసరిస్తుండటంతో ఆమెకు విజయాలు దూరమవుతూ వచ్చాయి. దీంతో ఇప్పుడు సినిమాల విషయంలో అనుష్క ఆచితూచి అడుగులు వేస్తోంది.

Anushka Shetty : అనుష్క బరువు తగ్గడానికి వాడుతున్న చిట్కాలు ఇవే..

ఈ క్రమంలో అనుష్క చెంతకు ఓ అదిరిపోయే కథ వచ్చినట్లు తెలుస్తోంది. ‘బెంగళూరు నాగరత్నమ్మ’ అనే స్క్రిప్టు స్వీటీ వద్దకు వచ్చిందట. ఓ దేవదాసీకి చెందిన కథ కావడంతో ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయని చిత్ర వర్గాలు అంటున్నాయి. సీనియర్ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఈ సినిమాను డైరెక్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కథను స్టార్ బ్యూటీ సమంతకు వినిపించగా, ఆమె ఈ సినిమా విషయంలో తన నిర్ణయం ఇంకా చెప్పలేదట. దీంతో సింగీతం నాగరత్నమ్మ కథను అనుష్క వద్దకు తీసుకొచ్చారట.

కథ నచ్చిందని చెప్పిన స్వీటీ కూడా ఈ సినిమాపై తన నిర్ణయాన్ని ఇంకా వెల్లడించలేదు. దీంతో ఈ సినిమాను ఆమె చేస్తుందా లేదా అనే సందేహం చిత్ర వర్గాల్లో నెలకొంది. నాగరత్నమ్మ పాత్ర కాస్త బోల్డ్‌గా ఉంటుందని, కానీ ఆమె అగ్రెసివ్‌గా ఉండటం నేటి ఆడియెన్స్‌కు బాగా కనెక్ట్ అవుతుందని చిత్ర యూనిట్ అంటోంది. అందుకే ఈతరం ఆడియెన్స్ మెచ్చే స్టార్ హీరోయిన్లే ఈ పాత్రను చేస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడు.

Anushka : ‘అరుంధతి’ సినిమాపై అనుష్క ఎమోషనల్ పోస్ట్

అనుష్క గతంలో చేసిన అరుంధతి, భాగమతి వంటి సినిమాల్లో ఆమె నటనకు ప్రేక్షకులు నీరాజనాలు పట్టారు. మరి ఇప్పుడు దేవదాసీ పాత్రలో అనుష్క కనిపిస్తుందో లేదో అనే సందేహం ఆమె అభిమానుల్లో నెలకొంది. అయితే దేవదాసీ పాత్ర అయినప్పటికీ నటనతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే హీరోయిన్‌గా ఈ సినిమాలో అనుష్క నటిస్తే బాగుంటుందని వారు కోరుతున్నారు. మరి ఈ సినిమాలో ఎవరు నటిస్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా మారిందనే చెప్పాలి.