Anushka: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో అంచనాలు పెంచేసిన స్వీటీ!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత అనుష్క సినిమా చేస్తుండటం.. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ అంచనాలను పెంచే విధంగా ఉండటంతో ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

Anushka Naveen Polishetty Movie Titled Ms Shetty Mr Polishetty
Anushka: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న తాజా చిత్రం నుండి ఎప్పుడెప్పుడు అప్డేట్ వస్తుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. చాలా రోజుల తరువాత అనుష్క సినిమా చేస్తుండటం.. ఇక ఈ సినిమాలో యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి కూడా నటిస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఈ సినిమాలోని ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఈ అంచనాలను పెంచే విధంగా ఉండటంతో ఈ సినిమా నుండి తాజాగా ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.
Anushka: రేపే అనుష్క 48వ చిత్ర టైటిల్ అనౌన్స్‌మెంట్.. క్లారిటీ ఇచ్చేసిన జాతిరత్నం!
అనుష్క కెరీర్‌లో 48వ చిత్రంగా వస్తున్న ఈ సినిమాను పూర్తి ఎంటర్‌టైనింగ్ సబ్జెక్ట్‌గా దర్శకుడు పి.మహేష్ తెరకెక్కిస్తుండగా, ఈ సినిమాలో అనుష్క ఓ చెఫ్ పాత్రలో నటిస్తోంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను చిత్ర యూనిట్ తాజాగా అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు ‘Miss.శెట్టి Mr.పోలిశెట్టి’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసింది. ఈ మేరకు ఓ అదిరిపోయే పోస్టర్‌తో టైటిల్‌ను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఓ స్టాండప్ కమెడియన్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
Anushka Shetty: నెక్ట్స్ మూవీ షూటింగ్‌లో జాయిన్ అయిన అనుష్క
కాగా, ఈ సినిమాను వీలైనంత త్వరగా ముగించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాలో భారీ తారాగణం నటిస్తోండగా, వేసవి కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తాజాగా తెలిపింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్ ప్రొడ్యూస్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.
Introducing our most favourite combo; #MissShettyMrPolishetty to you all?
Get ready for a Rollercoaster ride of Entertainment this Summer@MsAnushkaShetty @NaveenPolishety @filmymahesh @radhanmusic #NiravShah #RajeevanNambiar #KotagiriVenkateswararao @UV_Creations @adityamusic pic.twitter.com/mkG8bWrMnz
— UV Creations (@UV_Creations) March 1, 2023