Apollo Hospitals: తాతయ్యకే ఈ అవార్డు దక్కుతుంది – ఉపాసన కొణిదెల

సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం పరితపిస్తూనే ఉంటారు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. సొసైటీకే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా..

Apollo Hospitals: తాతయ్యకే ఈ అవార్డు దక్కుతుంది – ఉపాసన కొణిదెల

Uopasana Konidela

Apollo Hospitals: సెలబ్రిటీ హోదాను సామాజిక సేవకు ఉపయోగించాలని నిత్యం పరితపిస్తూనే ఉంటారు మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల. సొసైటీకే కాకుండా పర్యావరణ హితమైన కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటుంటారు. హ్యూమన్ లైఫ్‌తో పాటు వైల్డ్ లైఫ్ ను కాపాడాలనేది ఉపాసన ఆలోచన.

ఈ దిశగా తన సేవలను ఆపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ వైస్ ఛైర్ పర్సన్‌గా కొనసాగుతున్న ఉపాసన కొణిదెలకు ప్రతిష్టాత్మక నాట్ హెల్త్ సీఎస్ఆర్ అవార్డ్ దక్కింది. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అపోలో హాస్పిటల్స్ ఫౌండేషన్ చేస్తున్న కృషికి గుర్తింపుగా 2022 ఏడాదికి గాను ఈ పురస్కారాన్నిఅందుకోనున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఉపాసన కొణిదెల.. ‘ఓ గొప్ప కార్యక్రమంలో తమల్ని భాగం చేసిన తాతయ్య అపోలో ఆస్పత్రుల ఫౌండర్ ఛైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డికే ఈ అవార్డ్ ఘనత దక్కుతుంద”ని అన్నారు.
గ్రామీణాభివృద్ధిలో భాగంగా వైద్య సేవలను మెరుగుపర్చాలనే లక్ష్యమే తనకు స్ఫూర్తినిచ్చిందని స్పష్టం చేశారు. రామ్ చరణ్ ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రతో దేశవ్యాప్తంగా సినీ ప్రియులను ఆకట్టుకుంటుండగా.. సతీమణి ఉపాసన తన కెరీర్ లో భర్త గర్వించే పురస్కారాలు అందుకోవడం విశేషం.

 

Read Also : ఉపాసనకు దుబాయ్ నుంచి అరుదైన గౌరవం.. టాలీవుడ్ లో ఫస్ట్..