A R Rahman : ఎ ఆర్ రెహమాన్ కొడుకుకి షూటింగ్‌లో ప్రమాదం..

ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ కొడుకుకి షూటింగ్‌లో ప్రమాదం జరిగిందట. రెహమాన్ తనయుడు రమీన్ కూడా కూడా సంగీత గాయకుడే. కొంతమంది సింగర్స్ తో కలిసి రమీన్ మ్యూజిక్ ఆల్బమ్ వీడియో సాంగ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ముంబైలో..

A R Rahman : ఎ ఆర్ రెహమాన్ కొడుకుకి షూటింగ్‌లో ప్రమాదం..

AR Rahman's son AR Ameen met with an accident in shooting

A R Rahman : ప్రముఖ సంగీత దర్శకుడు ఎ ఆర్ రెహమాన్ కొడుకుకి షూటింగ్‌లో ప్రమాదం జరిగిందట. రెహమాన్ తనయుడు రమీన్ కూడా కూడా సంగీత గాయకుడే. కొంతమంది సింగర్స్ తో కలిసి రమీన్ మ్యూజిక్ ఆల్బమ్ వీడియో సాంగ్స్ కూడా చేస్తుంటాడు. ఈ క్రమంలోనే ముంబైలో ఒక మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో ప్రమాద జరిగినట్లు రమీన్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ప్రమాదం జరిగిన ఫోటోలను షేర్ చేశాడు.

Amitabh Bachchan : ప్రాజెక్ట్-K షూటింగ్‌లో అమితాబ్ బచ్చన్‌కి ప్రమాదం..

స్టేజి పై తన బృందంతో కలిసి రమీన్ మ్యూజిక్ వీడియో చిత్రీకరిస్తున్న సమయంలో.. పైన క్రేన్ తో సస్పెండ్ చేయబడిన లైట్ సెట్ అదుపు తప్పి స్టేజి పై ఉన్నవారి పై పడిపోయింది. దీంతో స్టేజి పై ఉన్నవారు లైట్ సెట్ కి స్టేజి కి మధ్య నలిగిపోయారు. ఈ క్రమంలో రమీన్ టీంకి తీవ్రంగా గాయాలు అయ్యాయి. ఈ సంఘటన నుంచి ఇంకా కోలుకోలేక పోతున్నాను అంటూ రమీన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు.

దీని పై రెహమాన్ కూడా స్పందించాడు. ”ముంబైలోని ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రమాదం నుంచి నా కొడుకు అమీన్ మరియు అతని టీమ్ దేవుని దయతో తప్పించుకున్నారు. ప్రస్తుతం మన భారతీయ సినీ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి సమయంలో సెట్ భద్రతా ప్రమాణాల విషయంలో కూడా మనం ఆ స్థాయిలో ద్రుష్టి పెట్టాలి అంటూ సూచించాడు. అలాగే జరిగిన సంఘటనపై దర్యాప్తు ఫలితాల కోసం ఎదురు చూస్తున్నట్లు వెల్లడించాడు. ఇక ఈ ప్రమాదం పై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by “A.R.Ameen” (@arrameen)