Ashu Reddy: హాట్‌నెస్ మీ కళ్ళలో ఉంది.. నా థైస్‌లో కాదు!

దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్‌..

Ashu Reddy: హాట్‌నెస్ మీ కళ్ళలో ఉంది.. నా థైస్‌లో కాదు!

Ashu Reddy

Ashu Reddy: దాదాపు ఐదారేళ్ల క్రితమే అమెరికా నుండి ఇండియాలో దిగిపోయిన అషు రెడ్డి.. ఈ షో.. ఆ షో అని లేకుండా.. ఈవెంట్లు.. స్టేజి షోలలో బాగానే సందడి చేస్తూ దూసుకుపోతోంది. అద్భుతమైన గ్లామర్‌.. అసలే అమెరికా నుండి దిగుమతి కావడంతో పెద్దగా హద్దులు లేవు. ఇంకా చెప్పాలంటే అందాలను అసలు దాచుకోదు. కానీ.. ఎందుకో పెద్ద అవకాశాలేమీ పట్టలేకపోతుంది. ఒకటికి మూడు ఛానెళ్లలో కామెడీ షోలలో సందడి చేస్తున్న అషు.. ఆ మధ్య దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూతో హైలెట్ కావాలనుకుంది.

Samantha-Akshay: సమంత ఇంట్లో అక్షయ్ దొంగతనం.. ఇదేం పాడు బుద్దని పోస్ట్!

గతంలో అరియనా లాంటి వాళ్ళు అలా ఆర్జీవీ చేతిలో పడి సెలబ్రిటీలు కావడంతో అషు కూడా ఆర్జీవీ మీదనే ఆశలు పెట్టుకుంది. కానీ.. అది పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. ఒకటీ రెండు రోజులు ఫోటోలు, ఇంటర్వూ హల్చల్ చేసినా తర్వాత అందరూ మర్చిపోయారు. అందుకే ఇప్పుడు.. తగ్గదేలేదని వరసగా ఫోటో షూట్లు చేసి వదులుతుంది. ముఖ్యంగా స్కర్ట్స్ లో ఎక్కువగా ఫోటో షూట్లు చేసే అషు తన బలం ఏంటో.. తన అందానికి అసెట్ ఏంటో తెలిసే అలా స్కర్ట్స్ లో ఫోటో షూట్లు చేస్తుందని అనుకున్నారు.

Movie Releases: ఫిబ్రవరి సినిమాలూ కష్టమే.. మళ్ళీ తప్పని వాయిదాల పర్వం!

అయితే.. నెటిజన్లు, ఆమె ఫోటోలు చూసిన వాళ్ళ మాటలు విన్నట్లే అషు రెడ్డి వారికి ఓ బోల్డ్ స్టేట్మెంట్ ఇచ్చింది. తాజా డిజైనర్ లుక్ ని ఆవిష్కరించే ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ‘హాట్ నెస్ మీ కళ్ళలోనే ఉంది.. నా థైస్ లో కాదు` అని కామెంట్స్ ట్యాగ్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ క్యాప్షన్ ఫోటోలు వైరల్ గా మారాయి. వేలు లక్షల్లో లైక్ లు పడుతుండగా బోల్డ్ బ్యూటీ.. బోల్డ్ కామెంట్స్ కేక అంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోటోలు, లైకులు సరే కానీ ఇంతకీ అషు నుండి భారీ ఆఫర్ వచ్చిందన్న న్యూస్ ఎప్పుడొస్తుందో చూడాలి.

 

View this post on Instagram

 

A post shared by Ashu Reddy❤️ (@ashu_uuu)