Avatar2: కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అవతార-2 ట్రైలర్ వచ్చేసింది..

ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ తర్కెక్కించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ "అవతార్". భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది. దాదాపు 10 ఏళ్ల పాటు నిర్మాణాల్లో ఉన్న ఈ సీక్వెల్ చిత్రం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు మూవీకి సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. 

Avatar2: కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ తో అవతార-2 ట్రైలర్ వచ్చేసింది..

Avatar2 Telugu Trailer Released

Avatar2: ప్రముఖ హాలీవుడ్ దర్శకనిర్మాత జేమ్స్ కామెరాన్ తర్కెక్కించిన సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ “అవతార్”. ప్రపంచవ్యాప్తంగా 2009లో విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ చిత్రం హిందీ, తెలుగు మరియు ఇతర ఇండియన్ డబ్బింగ్ వెర్షన్‌ లో ఊహకు అందని రీతిలో ప్రదర్శించబడడమే కాదు, అంతకుమించి కలెక్షన్లు కూడా రాబట్టింది. ఇంతటి విజయాన్ని అందుకున్న ఈ సినిమాకి ఇప్పుడు సీక్వెల్ రానుంది.

Avatar 2: ఆర్ఆర్ఆర్ బాటలో అవతార్.. అంత ఉన్నా తక్కువేనట!

దాదాపు 10 ఏళ్ల పాటు నిర్మాణాల్లో ఉన్న ఈ సీక్వెల్ చిత్రం డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. నేడు మూవీకి సినిమా ట్రైలర్ ని విడుదల చేసింది. ” ది వే ఆఫ్ వాటర్” అనే ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ చిత్ర కథాంశం సముద్ర గర్భంలో జరగనుంది. మొదటి భాగంలో నటించిన హీరో హీరోయిన్లకు పుట్టిన కొడుకు చుట్టూ ఈ సీక్వెల్ నడవనుంది. తండ్రి, కొడుకుల సెంటిమెంటుతో ఈ మూవీ ఎమోషనల్ గా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఇక సినిమాలోని గ్రాఫిక్స్ అయితే ఆడియన్స్ ని మరో ప్రపంచానికి తీసుకు వెళ్లేలా ఉన్నాయి.

డిసెంబర్ 16న విడుదలవుబోతున్న అవతార్2కి ఇండియాలో క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. అవతార్ నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేట్రికల్ హక్కుల కోసం భారీ ధరను కోట్ చేస్తున్నారట. తెలుగు పంపిణీ హక్కుల కోసం మేకర్స్ నుండి దాదాపు 100 కోట్ల రూపాయల భారీ కొటేషన్ వచ్చిందని సమాచారం. ఈ వార్త రియాలిటీగా మారితే తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రూ.100 కోట్ల షేర్ వసూలు చేస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.