Avatar 2: ఆర్ఆర్ఆర్ బాటలో అవతార్.. అంత ఉన్నా తక్కువేనట!

హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువుల్ వండర్ మూవీ ‘అవతార్’ యూనివర్సల్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు అవతార్-2 చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్. ఈ సినిమాకు ఇండియన్ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఉండటంతో, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతోందట అవతార్-2.

Avatar 2: ఆర్ఆర్ఆర్ బాటలో అవతార్.. అంత ఉన్నా తక్కువేనట!

Avatar 2: హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన విజువుల్ వండర్ మూవీ ‘అవతార్’ యూనివర్సల్ బాక్సాఫీస్‌ను ఏ విధంగా షేక్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను థియేటర్లలకు పరుగులు పెట్టేలా చేసింది. ఈ సినిమాకు సీక్వెల్స్ కూడా ఉంటాయని గతంలోనే చిత్ర యూనిట్ పేర్కొంది. ఇప్పుడు అవతార్-2 చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్నారు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకు సంబంధించి తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో ఓ వార్త జోరుగా చక్కర్లు కొడుతోంది.

Avatar 2: సినిమా పంథాను మార్చేసే అవతార్ 2.. విజువల్ వండర్ రెడీ!

అవతార్-2 చిత్రాన్ని తొలిభాగం కంటే కూడా గ్రాండియర్‌గా, అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమాలోని విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని చిత్ర యూనిట్ చెబుతోంది. అయితే ఈ సినిమాకు ఇండియన్ మార్కెట్‌లోనూ మంచి క్రేజ్ ఉండటంతో, ఇండియాస్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ను ఫాలో అవుతోందట అవతార్-2. ఇంతకీ ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాను ఏ విషయంలో అవతార్-2 ఫాలో అవుతుంది అని మీరు ఆలోచిస్తున్నారా.

Avatar 2: హాలీవుడ్ కీ తప్పని లీకుల బెడద.. ఆన్​లైన్​లో ‘అవతార్​ 2’ ట్రైలర్​!

ఆర్ఆర్ఆర్ చిత్రానికి లెంగ్తీ రన్‌టైమ్ ప్లస్ పాయింట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే ఫార్ములాను అవతార్-2 టీమ్ కూడా ఫాలో అవుతోందట. అవతార్-2 మూవీకి ఏకంగా 3 గంటల 10 నిమిషాల రన్‌టైమ్‌ను లాక్ చేసేందుకు ప్లాన్ చేస్తోందట చిత్ర యూనిట్. ఇంత లెంగ్తీ రన్‌టైమ్ అయినా కూడా ప్రేక్షకులను ఎంగేజింగ్ చేసే కంటెంట్ ఉండనుండటంతో ఈ సినిమా జనాలకు ఎక్కడా బోర్ కొట్టదని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. మరి రన్‌టైమ్ విషయంలో అవతార్-2 సినిమాకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో చూడాలి.