Pop Corn Trailer : పాప్ కార్న్ ట్రైలర్ రిలీజ్.. మళ్ళీ లిఫ్ట్ కథే.. ఇందులో కొత్తదనం ఏముందో చూడాలి..

ఇటీవల ఇలా లిఫ్ట్ కథాంశంతో పలు సినిమాలు వస్తున్నాయి. సినిమా లీడ్ ఎక్కడో తీసుకొని లిఫ్ట్ లో ఇరుక్కున్నట్టు, మళ్ళీ క్లైమాక్స్ కి లిఫ్ట్ నుంచి బయటకి వచ్చినట్టు, లిఫ్ట్ లో ఉన్నంతసేపు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని క్రియేట్ చేసేలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా ట్రైలర్ చూస్తుంటే ఆల్మోస్ట్...............

Pop Corn Trailer : పాప్ కార్న్ ట్రైలర్ రిలీజ్.. మళ్ళీ లిఫ్ట్ కథే.. ఇందులో కొత్తదనం ఏముందో చూడాలి..

Avika Gor Pop Corn Trailer released

Pop Corn Trailer :  అవికా గోర్‌, సాయి రోన‌క్ జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ‘పాప్ కార్న్’. ఎం.ఎస్‌.చ‌ల‌ప‌తి రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ఆచార్య క్రియేష‌న్స్, అవికా స్క్రీన్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై బోగేంద్ర గుప్తా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ముర‌ళి గంధం ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. బుధ‌వారం ఈ మూవీ ట్రైల‌ర్‌ను కింగ్ నాగార్జున విడుద‌ల చేశారు. ఈ సినిమాతో అవికా గోర్ నిర్మాతగా కూడా మారుతోంది.

తాజాగా పాప్ కార్న్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ లో.. ముఖ ప‌రిచ‌యం లేని అబ్బాయి, అమ్మాయి ఓ షాపింగ్ మాల్‌లోకి ఎంట‌ర్ అవుతారు. అక్క‌డ షాపింగ్ పూర్తి చేసుకుంటారు. లిఫ్ట్ ఎక్కుతారు. ఎక్క‌గానే ఆ అమ్మాయి తాను లిఫ్ట్ నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోవాల‌నుకుంటుంది. ఆ అబ్బాయి త‌న‌ని లాగి పెట్టి ఒక‌టి కొడ‌తాడు.అడిగితే ప్రాంక్ చేశానంటాడు. అలాంటి ఈజీ గోయింగ్ మైండ్ సెట్ ఉన్న అబ్బాయి త‌నొక‌ మ్యూజిషియ‌న్‌ అని చెప్తాడు. ఇక అమ్మాయి విష‌యానికి వ‌స్తే త‌నొక పెద్ద అంద‌గ‌త్తెన‌నే అనే కాన్ఫిడెన్స్‌తో ఉంటుంది. ఇలాంటి భిన్న‌మైన మ‌న‌స్త‌త్వాలున్న వీరిద్ద‌రు అనుకోకుండా షాపింగ్ మాల్‌లోని ఆ లిఫ్ట్‌లో ఇరుక్కుంటారు. అదే సమయంలో ఆ మాల్ లో బాంబు బ్లాస్ట్ జరిగి లిఫ్ట్ చెల్లర్ కి వచ్చి ఆగిపోతుంది. దీంతో ఆ లిఫ్ట్ లో వీళ్ళేం చేశారు, ఎలా ఉన్నారు, ఎప్పటిదాకా ఉన్నారు, ఎలా బయటకి వచ్చారు అనేదే కథాంశం. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింద‌నేది, ఈ జ‌ర్నీలో వారిద్దరి మధ్య క్రియేట్ అయిన ఎమోషనల్ బాండింగ్ గురించి తెలియజేసే సినిమాయే ‘పాప్ కార్న్’ అని ట్రైల‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది.

Rashmika Mandanna : చాలా మంది మేమిద్దరం కలిసి సినిమా చేయాలనుకుంటున్నారు.. విజయ్ తో కలిసి మళ్ళీ సినిమా చేస్తా..

ఇటీవల ఇలా లిఫ్ట్ కథాంశంతో పలు సినిమాలు వస్తున్నాయి. సినిమా లీడ్ ఎక్కడో తీసుకొని లిఫ్ట్ లో ఇరుక్కున్నట్టు, మళ్ళీ క్లైమాక్స్ కి లిఫ్ట్ నుంచి బయటకి వచ్చినట్టు, లిఫ్ట్ లో ఉన్నంతసేపు ఏం జరుగుతుందా అనే ఉత్కంఠని క్రియేట్ చేసేలా సినిమాలు వస్తున్నాయి. ఇది కూడా ట్రైలర్ చూస్తుంటే ఆల్మోస్ట్ అలాగే అనిపిస్తుంది. కాకపోతే లిఫ్ట్ లో తీసిన సినిమాకి పాప్ కార్న్ అనే టైటిల్ పెట్టి చేతిలో ఉంటే పాప్ కార్న్ బ‌కెట్‌ ఉంది పాప్ కార్న్ తింటుంటే కాస్త కారంగా, ఉప్పగా, స్వీట్‌గా ఉంటూ మ‌న డిఫ‌రెంట్ ఫీలింగ్‌ను ఎలా కలిగిస్తుందో ఈ సినిమా కూడా అలాంటి డిఫ‌రెంట్ ఎమోష‌న్స్ కాంబినేష‌న్‌తో ఉంటుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ పాప్ కార్న్ సినిమాని ఫిబ్రవరి 10న థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమాతో అవికాకి హీరోయిన్ గా, నిర్మాతగా ఎంత ప్లస్ అవుతుందో చూడాలి.