NBK 107 : సిరిసిల్లలో బాలయ్య బాబు సినిమా షూటింగ్

బాలయ్య 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పటికే ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ని అనౌన్స్ చేశారు. తాజాగా......

NBK 107 :  సిరిసిల్లలో బాలయ్య బాబు సినిమా షూటింగ్

Nbk107

Balakrishna :  బాలకృష్ణ ప్రస్తుతం మంచి జోష్ లో ఉన్నారు. ఇటీవల ‘అఖండ’ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. బోయపాటి కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్ కొట్టారు. ఈ సినిమా భారీ హిట్ గా నమోదయి దేశ విదేశాల్లోనూ ‘అఖండ’ మానియా కొనసాగింది. మరో పక్క ఆహాలో బాలయ్య బాబు హోస్ట్ గా చేసిన ‘అన్ స్టాపబుల్ విత్ NBK’ సరికొత్త రికార్డులని సృష్టించింది. ఇక బాలయ్య నెక్స్ట్ సినిమా NBK 107 కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.

 

బాలయ్య 107వ సినిమా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఇటీవలే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా జరిగింది. ఇప్పటికే ఇందులో హీరోయిన్ గా శృతి హాసన్ ని అనౌన్స్ చేశారు. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Prakash Padukone : తండ్రి బయోపిక్‌ని తెరకెక్కించనున్న దీపిక పదుకొణె

తాజాగా ఈ సినిమా షూటింగ్‌ శుక్రవారం సిరిసిల్లలో ప్రారంభమైంది. ఫైట్‌ మాస్టర్స్‌ రామ్‌ లక్ష్మణ్‌ ఆధ్వర్యంలో భారీ యాక్షన్‌ సన్నివేశాలతో సినిమా చిత్రీకరణ మొదలుపెట్టారు. బాలకృష్ణ ఈ షూట్ లో జాయిన్ అవ్వనున్నారు. బాలయ్య సినిమా షూటింగ్ అని తెలియడంతో సిరిసిల్లలో షూటింగ్ చూడటానికి ప్రజలు ఎగబడ్డారు.