NBK108: బాలయ్య మరొకటి మొదలెట్టేశాడు.. నిజంగానే అన్‌స్టాపబుల్..!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన జోరును కొనసాగిస్తూ నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

NBK108: బాలయ్య మరొకటి మొదలెట్టేశాడు.. నిజంగానే అన్‌స్టాపబుల్..!

NBK108 Launch

NBK108: నందమూరి బాలకృష్ణ నటిస్తున్న తాజా చిత్రం ‘వీరసింహారెడ్డి’ సంక్రాంతి బరిలో రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకున్న ఈ సినిమాలో కేవలం ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే, బాలయ్య తన జోరును కొనసాగిస్తూ నెక్ట్స్ ప్రాజెక్టును రెడీ చేస్తున్నాడు. యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య తన కెరీర్‌లోని 108వ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు.

NBK108: NBK108 ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య అండ్ టీమ్!

ఇప్పటికే అఫీషియల్‌గా అనౌన్స్ చేసిన ఈ సినిమాను నేడు అధికారికంగా ప్రారంభించారు. డిసెంబర్ 8న ఈ సినిమాను ప్రారంభిస్తామని చిత్ర యూనిట్ గతంలోనే తెలిపింది. చెప్పినట్లుగానే ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేశారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్ హాజరయ్యారు. స్టార్ ప్రొడ్యూసర్స్ అల్లు అరవింద్, దిల్ రాజు, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, నవీన్, శిరీష్‌లు ఈ పూజా కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సినిమాకు అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, దిల్ రాజు కెమెరా స్విచాన్ చేశారు.

NBK108: బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’ కాన్సెప్ట్‌తో రానున్న అనిల్ రావిపూడి మూవీ..?

ఇక తొలి షాట్‌ను రాఘవేంద్రరావు డైరెక్ట్ చేయగా, శిరీష్-నవీన్‌లు స్క్రిప్టును దర్శకుడు అనిల్ రావిపూడికి అందించారు. అనిల్-బాలయ్య కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడం ఖాయమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఇక ఈ సినిమాలో బాలయ్యను ఓ సరికొత్త లుక్‌లో అనిల్ రావిపూడి చూపించబోతున్నాడని ఇప్పటికే తెలపడంతో, బాలయ్యను ఆయన ఎలా ప్రెజెంట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, బాలయ్య కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా, థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. సాహు గారపాటి, హరీష్ పెద్దిలు సంయుక్తంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.